జాతీయ వార్తలు
అమీర్‌ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే రివార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పంజాబ్ శివసేన అధ్యక్షుడి ఆఫర్చండీగఢ్, నవంబర్ 26: దేశంలో అసహనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించిన బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌పై విమర్శల దాడి తగ్గడం లేదు. బాలీవుడ్ నుంచి రాజకీయ పార్టీలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శివసేన పార్టీ ఓ ఆఫర్ ఇచ్చింది. అమీర్‌ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. రివార్డును పంజాబ్ శివసేన రాష్టశ్రాఖ చైర్మన్ రాజీవ్ టాండన్ ప్రకటించినట్టు మీడియా తెలిపింది. సహనశీలతపై ఓ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ వెల్లడించిన అభిప్రాయాలపై శివసేన తీవ్రంగా మండిపడుతోంది. లూధియానాలో బాలీవుడ్ హీరో బస చేసిన ఎంబిడి రెడిసన్ బ్లూ హోటల్ ఎదుట బుధవారం శివసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అమీర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యకర్తలు ఆయనపై విమర్శలు గుప్పించారు. ఫ్లిక్ దంగల్ చిత్రం షూటింగ్ నిమిత్తం ఖాన్ ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్‌కు లూధియానా పోలీసులు గట్టి భద్రత కల్పించారు. 50 ఏళ్ల ఖాన్ ఇంట్లో తన భార్యతో జరిగిన సంభాషణను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక్కడ అసహనం పెరిగిపోయినందున దేశం విడిచి వెళ్దామని తన భార్య కిరణ్‌రావు తనతో అన్నదని ఖాన్ చెప్పారు. దేశంలో తమ కుటుంబానికి భద్రత ఉందా అన్న భయం కలిగిందని కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలో తాను వెలుబుచ్చిన అభిప్రాయాలు మొత్తం పరిశీలించకుండా విమర్శలకు దిగుతున్నారని తెలిపారు.