జాతీయ వార్తలు

ఎయిమ్స్‌లో‘ సేవా సప్తాహా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ నేత జేపీ నడ్డా ఎయిమ్స్‌లోని గదులు, కారిడార్‌లను ఊడ్చారు. మోదీ ఈనెల 17న పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు సేవా సప్తాహా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అమిత్ షా, బీజేపీ నేతలు ఎయిమ్స్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు ఆహారం, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశ సేవ కోసం అంకితమిచ్చారని అన్నారు. అందుకే సేవా సప్తాహా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినట్లు తెలిపారు.