జాతీయ వార్తలు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జమ్మూకశ్మీర్‌కు ముఖ్యంగా వైష్ణోదేవి యాత్రకు వెళ్లే యాత్రీకులకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఢిల్లీ నుంచి కట్రా స్టేషన్ వరకు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. అమిత్ షా గురువారం న్యూఢిల్లీ రైల్వేస్టేషను నుంచి ప్రారంభించారు. వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ వల్ల ప్రయాణసమయం నాలుగుగంటలు తగ్గుతుందని మంత్రి చెప్పారు. రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో 2022 కల్లా 40 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వినోద్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు రైల్వే అధికారులు పాల్గొన్నారు.