జాతీయ వార్తలు

సాధ్వి ప్రజ్ఞాపై అక్రమ కేసులు బనాయింపు:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: సాధ్వి ప్రజ్ఞాసింగ్‌పై అక్రమ కేసులు బనాయించారని, కోర్టులు సైతం ఆమెను నిర్దోషిగా పేర్కొన్నాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ స్వామి అసిమానందపై కూడా అక్రమకేసులు పెట్టారని ఆయన అన్నారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను భోపాల్ అభ్యర్థిగా నిలబెట్టడం సరైన నిర్ణయమని ఆయన అన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో ఇక్కడ పోరాడుతున్నామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై మమతాబెనర్జీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలని డిమాండ్ చేశారు. బెంగాల్‌లో పౌరసత్వ నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలుచేస్తామని తెలిపారు. బీజేపీ నాయకుల ర్యాలీకి మమతాబెనర్జీ అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. రెండు విడతులుగా జరిగిన పోలింగ్‌ని చూస్తే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు.