పాటల్లో అమ్మాయి.. ఆరుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్ర, ఆశాలత జంటగా మురళీప్రసాద్ దర్శకత్వంలో అక్షయప్రత్యుష ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామచంద్ర దోసపాటి నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి.. ఆరుగురు’. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన బ్యానర్‌లో తీసే సినిమాల్లో కొత్త వారిని పరిచయం చేస్తుంటానన్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో పరిచయమైన వారందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఈ సినిమాలోని పాటలు బాగున్నాయన్నారు. దర్శకుడు మురళీ స్క్రిప్ట్‌వర్క్ బాగా చేస్తాడని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. దర్శకుడు మురళీ మాట్లాడుతూ, రెండు సినిమాలు చేశానని, మంచి కథతో ఇది మూడో సినిమా అని, వందేమాతరం శ్రీనివాస్‌గారు మంచి పాటలు అందించారన్నారు. హారర్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదన్నారు. ఆరుగురు డబ్బున్న అబ్బాయిలు ఓ జంటను చంపేయడం, ఆ జంటలోని అమ్మాయి దయ్యంగా మారి, వీరిపై ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది అన్నారు. మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర యూనిట్ సభ్యులకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని అన్నారు.