అనగనగా

వదిలెయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నించి తిరిగి వచ్చిన రితేష్ తన తల్లితో చెప్పాడు
‘‘ఇంక నేను వీరేష్‌తో స్నేహం చేయను’’.
‘‘అదేం? వాడు నీ బెస్ట్‌ఫ్రెండ్ కదా?’’ ఆవిడ అడిగింది.
‘‘ఇందాకటిదాకా, ఇప్పుడు కాదు’’.
‘‘ఏమైంది?’’
‘‘మేము ప్లే అవర్‌లో త్రోబాల్ ఆట ఆడుకుంటున్నాం. నేను కాపీ కొట్టి వాడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నానని వాడు అందరిముందు నన్ను ఎగతాళి చేశాడు’’ రితీష్ కోపంగా చెప్పాడు.
‘‘కాపీ మాట నిజమా?’’ తల్లి అడిగింది.
‘‘కాదు’’- వాడు ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు.
తల్లి కొన్ని క్షణాలు ఆలోచించి అడిగింది.
‘‘ఇందాక మీరు ఏం ఆట ఆడారన్నావు?’’
‘‘త్రో బాల్’’
‘‘దాన్ని ఎలా ఆడతారు?’’
‘‘నీకు త్రోబాల్ ఆట తెలీదా? అంతా గుండ్రంగా నించుంటాం. మధ్యలో వున్నవాడు బంతిని మాలోని ఎవరికైనా విసరచ్చు. అలర్ట్‌గా వుండి దాన్ని పట్టుకోవాలి. లేదా అవుట్ అవుతాడు’’.
‘‘మరి నువ్వూ ఆ పని చేయవచ్చుగా?’’
‘‘ఏ పని?’’ అర్థం కాని రితీష్ అడిగాడు.
‘‘నువ్వా బంతిని పట్టుకోకుండా ఉండాల్సింది’’.
‘‘నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడంలేదు’’.
‘‘ఎవరైనా మనమీదకి విసిరే తిట్లు, విమర్శలు బంతుల్లాంటివి. మనం వాటిని పట్టుకుంటే బాధపడతాం. అసలు పట్టుకోకుండా వదిలేస్తే బాధ ఉండదు’’.
‘‘మాటల్ని పట్టుకోకుండా వదిలేయడమా? అదెలా?’’
‘‘పట్టుకోకుండా అంటే పట్టించుకోకుండా. వాళ్ళది తప్పు, మనం రైటు అని తెలిసినపుడు మనం ఆ మాటలని పట్టించుకోకూడదు. బంతిని పట్టుకుంటామా లేదా వదిలేస్తామా అన్నది మన చేతుల్లోనే ఎలా వుందో, అలాగే ఇతరుల తిట్లని, విమర్శలని పట్టించుకోకుండా వదిలేయడం కూడా మన చేతుల్లోనే వుంది. అందువల్ల మనకి చాలా వత్తిళ్ళు తగ్గుతాయి. చేప గేలాన్ని కొరక్కపోతే అది ఎలా క్షేమంగా ఉంటుందో అలా మనం మాటల గేలాన్ని కొరక్కుండా వదిలేయాలి. ఇలా చేస్తే విసుగేసి చివరికి వాళ్ళు మనల్ని లాభం లేదని పట్టించుకోరు. ఐతే ఏ బంతులు పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అన్నది మన విజ్ఞతమీద ఆధారపడి ఉంటుంది. మనమీదకి నిత్యం చాలామంది అలాంటి బంతులు విసురుతూనే ఉంటారు. వాటన్నింటినీ పట్టుకుంటే మనకు పిచ్చెక్కుతుంది’’.
‘‘అర్థమైంది. ఇక నన్ను ఎవరు ఏం అన్నా దాన్ని ఎలా తీసుకోవాలో అర్థమైంది’’ రితీష్ ఉత్సాహంగా చెప్పాడు.
*

మల్లాది వేంకట కృష్ణమూర్తి