అనగనగా

ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వనమాలి కోపంగా చెప్పాడు.
‘ఇది చెయ్యకు. అది చెయ్యకు. చివరకి అన్నం తినడానికి కూడా అనుమతి తీసుకోవాలి’’
‘ఎవరి గురించి’ తల్లి నవ్వుతూ అడిగింది.
‘నాఫ్రెండు సుధీర్. అన్నిటికీ వాడు నామీద పెత్తనం చేస్తాడు. వాడితో కటీఫ్ చెప్పేస్తాను.’
సరిగ్గా ఆ సమయంలో బయట ఉన్న కారు మీదికి వచ్చివాలిన ఓ పిచ్చుక రియర్ వ్యూ అద్దాన్ని పొడవసాగింది.
‘అదిగో చూడు ఆ పిచ్చుక ఏం చేస్తోందో’
‘వ్రును. కొద్దిసేపటికి అదే అలసిపోతుంది. నేను కార్‌ని గేరేజ్‌లో పెడతాను’ తండ్రి చెప్పాడు.
కారుగేరేజ్‌లోకి వెళ్లాక ఆ పిచ్చుక గడ్డిలోని ఇంకో పిచ్చుకతో పోట్లాడసాగింది.
‘ఎందుకు అవి పోట్లాడుకుంటున్నాయి’ వనమాలి అడిగాడు.
‘తను గూడు కట్టుకునే భూభాగం కోసం. ఇందాక నువ్వు చూసిన అద్దంలోని ప్రతిబింబం మీద దాడి కూడా అందుకే. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి వేరే పిచ్చుక తన భూభాగంలోకి వచ్చిందని భయపడింది.’ తండ్రి చెప్పాడు.
‘దాని ప్రతిబింబంతో అది పోట్లాడితే , శఖ్తిని వృథా చేయడం తప్ప ఉపయోగం ఏముంది?’వనమాలి ఆశ్చర్యంగా చెప్పాడు.
‘నువ్వు చేసింది ఆ పనే. నీ మనసులోని అహం అనే గూడు మీదికి ఎవరు దాడి చేసినా నువ్వు ఎదురుదాడి చేస్తావు. నిజానికి ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి నీ ప్రతిబింబమే. మనం ప్రవచనంలో విన్న బ్రహ్మ సత్యం -జగత్ మిథ అంటే ఇదే. ఉన్నది ఒక్కటే. కాని ప్రపంచం అనే అద్దంలో అనేక ప్రతిబింబాలుగా మనకి మనమే కనిపిస్తుంటాం. వివేక చూడామణిలోని ఇరైయ్యవ శ్లోకం ఇది’
‘అర్థమైంది. ఆ పిచ్చుకకి అది తన ప్రతిబింబమని ఎలా తెలీదో మనకి కూడా ప్రపంచం అద్దం అని తెలీకుండా బతుకుతూ అనేక రూపాల్లోని మనతో మనమే స్నేహం చేస్తూపోట్లాడుకుంటున్నామన్నమాట. ’ వనమాలి ఆలోచనగా చెప్పాడు.
‘అవును. ఇద అర్ధం చేసుకుంటే ఇక ఎవరిత ఫోట్లాడలేం’ తండ్రి చెప్పాడు. *

మల్లాది వేంకట కృష్ణమూర్తి