అనగనగా

అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శ్రావ్యశ్రీ ముభావంగా ఉండటం గమనించిన తల్లి అడిగింది.
‘‘ఏమైంది?’’
‘‘స్కూల్ బ్యూటీ పోటీలో అభ్యర్థిగా నన్ను ఎన్నుకోలేదు. నేను అందంగా ఉండనా?’’ అడిగింది.
ఆ మాటలు విన్న శ్రావ్యశ్రీ తండ్రి బయట తోటలోంచి పిలిచాడు.
‘శ్రావ్! ఓ సారి బయటకి రా. నీకు ఒకటి చూపించాలి’
శ్రావ్యశ్రీ అద్దంలో చూసుకుని, జుట్టు సరిచేసుకొని ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్లిం. ఆయన తను పెంచిన పూల మొకకల నించి పూలని కొమ్మలతో సహా కత్తెరతో కట్ చేసి వేజ్‌లో అలంకరిస్తున్నాడు.
‘పూలు ఎలా ఉన్నాయి?’ అడిగాడు.
‘చాలా అందంగా ఉన్నాయి. ఇవి నువ్వు పెంచిన మొక్కల్లేగా’
‘అవును. చమట, మట్టి అంటడం ఈ అందం కోసమే. కాని నాకు ఒకటి అనిపిస్తోంది. వీటి బదులు గులాబీలని పెంచాల్సిం ది అవి ఇంకా అందంగా ఉంటాయి’’
‘‘కాని ఇవన్నీ కూడా బానే ఉన్నాయిగా ?’’ శ్రావ్యశ్రీ అంది.
‘నాకు గులాబీలు తప్ప ప్రపంచంలో ఇంకే పువ్వులూ అందంగా ఉండవు. ఈ మొక్కలని పీకేసి గులాబీ మొక్కలని నాటుతాను. సరేనా’ అన్నాడు తండ్రి.
వాటిని పీకబోతున్న తండ్రికి అడ్డుపడి శ్రావ్యశ్రీ ఇలా చెప్పింది.
‘వద్దు నాన్న! నువ్వు ఎంత కష్టపడి పెంచావు వీటిని. గులాబీలు కాకపోయినా ఈ పూలు కూడా అందంగా ఉన్నాయి. కాబట్టి పీకొద్దు’
‘నువ్వు అసలు విషయానికి వచ్చావు. గులాబీలు లేకపోనా ఇవన్నీ కూడావేరే రంగుల్లో , వేరే పరిణామాల్లో అందంగా ఉన్నాయని అంటున్నావు. కనకాంబరాలు, చేమంతులు, మన్మథ బాణాలు అందంలో కనీసం గులాబీలతో సమానంగా ఉన్నాయా?’
‘కొత్తగా అడుగుతావేమిటి? వేటి అందం వాటికి’
‘అలాగే మానవ వనంలో దేవుడు తోటమాలి.’
అన్నాడు తండ్రి.
‘దేవుడు తోటమాలా?’ ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్యశ్రీ
‘అవును నువ్వు దేవుని బిడ్డవి. నువ్వంటే ఆయనకి ఇష్టం. దేవుడు ప్రతి ఒక్కర్నీ అపూర్వంగా సృష్టించారు. కనకాంబరాలు, మందాలాలతో,మందారాలతో మల్లెలతో పోల్చుకుని బాధపడవు. వేటికవి తాము అందగత్తెలమనే అనుకొంటాయి. మనం కూడా అందంలో,చదువు, సంపదల్లో ఇతరులతో పోల్చుకోకూడదు. ఆ పోలికే బాధ, పోల్చుకోకపోవడమే ఆనందం. ’తండ్రి చిరునవ్వుతోచెప్పాడు.
తండ్రి చెప్పిందేమిటో శ్రావ్యశ్రీకి అర్థం అయింది.
తేలిగ్గా నిట్టూర్చి చెప్పింది.
‘నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నాన్నా. ఇపుడు నాలో స్కూల్ బ్యూటీ పోటికీ నన్ను ఎంపిక చేయలేదనే బాధలేదు’
‘తోటి మనుషుల చేత అందగత్తె అనిపించుకునే కంటే భగవంతుడి దృష్టిలో అందంగా ఉండటం ముఖ్యం’ తండ్రి చెప్పాడు.
చిరునవ్వుతో చూస్తున్న శ్రావ్యశ్రీతో తండ్రి
‘యు షుడ్ బి బ్యూటిపుల్ టు గాడ్’ అన్నాడు.
అప్పటి దాకా దిగులు తో నిండిన మనసు ఇపుడు ఆనందంతో నిండింది. సంతోషంగా ఈల వేసుకొంటూ లోపలికి పరుగెత్తింది శ్రావ్యశ్రీ.
*

--మల్లాది వేంకట కృష్ణమూర్తి