అనగనగా

చప్పుళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా..
వేసవి శెలవలకి మామయ్య కుటుంబం దిప్తార్క ఇంటికి వచ్చింది. దిప్తార్క, మామయ్య కొడుకు తరంగ్, మరో ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకోసాగారు. తరచూ వారి మధ్య వాదనలు, పోట్లాటలు చెలరేగసాగాయి.
‘‘మేము ప్రతిరోజూ ఉదయం పదకొండుకి పోగో ఛానల్ చూస్తూంటాం. కాబట్టి అదే చూడాలి.’’ రిమోట్ పట్టుకున్న దిప్తార్క చెప్పాడు.
‘‘మేము ఆ సమయంలో డిస్కవరీ ఛానల్ చూస్తాం. అదే చూడాలి.’’ టీవీ ముందున్న తరంగ్ చెప్పాడు.
‘‘కుదరదు.’’ దిప్తార్క అరిచాడు.
‘‘కుదురుతుంది.’’ మిగిలిన పిల్లలు అరిచారు.
వాళ్ళ కంఠాలు పెరిగి ఆ విషయం మీద అంతా పోట్లాడుకోసాగారు. అకస్మాత్తుగా వంటగదిలోంచి ఖంగుమనే పెద్ద శబ్దం వినిపించింది.
‘‘ఏమిటది?’’ ఉలిక్కిపడ్డ తరంగ్ అడిగాడు.
‘‘ఏమో మరి?’’ దిప్తార్క జవాబు చెప్పాడు.
ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. మళ్ళీ, మళ్ళీ.
‘‘ఇంక ఆ శబ్దం భరించలేను.’’ తరంగ్ రెండు చెవులూ మూసుకుని చెప్పాడు.
దిప్తార్క తల్లి చేతిలో స్టీల్ పళ్ళెం, గరిటెలతో ఆ గదిలోకి వచ్చింది. ఆమె గరిటెతో పళ్ళాన్ని కొట్టడంతో మరోసారి ఆ శబ్దం భయంకరంగా వినిపించింది.
‘‘ఏమిటిదమ్మా?’’ దిప్తార్క ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నేను కనిపెట్టిన వాయిద్యం. బాగుంది కదా?’’ అని అడిగి ఆమె మరోసారి శబ్దం చేసింది.
‘‘దయచేసి ఆ చప్పుడు ఆపు.’’
‘‘మీకు ఇది బాలేదా?’’
‘‘లేదు.’’ నలుగురు పిల్లలూ ఒకేసారి చెప్పారు.
‘‘వంటగదిలోని నాకు మీరు చేసే శబ్దాలు కూడా నచ్చలేదు.’’ తల్లి నవ్వుతూ చెప్పింది.
‘‘మేం ఇలాంటి భయంకరమైన శబ్దాలని ఎక్కడ చేశాం?’’
‘‘కానీ మీ మాటల్లో పోట్లాట, అసహనం, కోపం తప్ప ఎలాంటి ప్రేమా లేదు.’’
పిల్లలు తెల్లబోయి చూశారు.
‘‘మీ అందరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం. కానీ మీ మాటల్లో కోపం తప్ప ప్రేమ కనిపించడం లేదు. ప్రేమ లేని మాటలు ఇలాంటి శబ్దాలే చేస్తాయి.’’ ఆమె మరోసారి పళ్ళెం మీద గరిటెతో కొట్టి చెప్పింది.
ఆమె మళ్ళీ చెప్పింది.
‘‘మనం ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి. లేదా ఇలాంటి భరించలేని శబ్దాలే చేస్తాయి. దేవతలు మాట్లాడినా సరే.’’
‘‘అర్థమైంది. ఇక మేం పోట్లాడుకోం.’’ తరంగ్ చెప్పాడు.
స్పీక్ విత్ లవ్.. *

మల్లాది వెంకట కృష్ణమూర్తి