అనగనగా

దేవుడి ఆశీర్వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశం మేఘావృతమైంది. టీవీలో తుఫాను హెచ్చరిక విన్నాక శస్త్రుగ కుటుంబ సభ్యులంతా తమ పెంకుటింటిని వదిలి దూరంగా ఉన్న ఆ పాప మామయ్య డాబా ఇంటికి చేరుకున్నారు.
‘‘మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం?’’ శస్త్రుగ అడిగింది.
‘‘ ఎందుకంటే తుఫాను ధాటికి మీ పెంకుటిల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ డాబా ఇంటిని తుఫాను ఏం చేయలేదు.’’ శస్త్రుగ మామయ్య చెప్పాడు.
కొద్దిసేపటికి శస్త్రుగ గాలిహోరుని విని కిటికీలోంచి బయట గాలితీవ తకి కదిలే వఋక్షాలని చూసి చెప్పింది.
‘‘బాబోయ్! చాలా పెద్ద తుఫానులా ఉంది.’’
‘‘అవును. అందుకే ఇక్కడికి వచ్చారు. మనం దేవుడ్ని ప్రార్థిద్దాం.’’ మామయ్య చెప్పాడు.
ఆయన చెప్తూంటే అంతా విష్ణుసహస్రనామాలని బయటకి చెప్పసాగారు. దాదాపు గంటన్నర తర్వాత అవి పూర్తయ్యాక శస్తు గ చెప్పింది.
‘‘ ఇదేమిటి మామయ్యా? దేవుడ్ని తుఫాను ఆపమని ప్రార్థించలేదు? ఇంకా వర్షం వస్తోంది.’’
‘‘తుఫాను దేవుడి ఆశీర్వచనం. మనకి అవసరమైన నీటిని ఆ వర్షం ఇస్తుంది. బావులు, చెరువులు నిండితే ఈ వేసవిలో మనకి నీటి కొరత ఉండదు.’’ మామయ్య జవాబు చెప్పాడు.
‘‘అర్థమైంది.’’ శస్త్రుగ చెప్పింది.
‘‘కొద్దిసేపాగి మామయ్య మళ్ళీ చెప్పాడు.’’
‘‘మన జీవితాల్లో కూడా ఇలాగే తరచూ కష్టాలనే తుఫానులు వస్తూంటాయి. తుఫానులు రాకుండా ఉండాలని ప్రార్థించినా అవి రాకుండా ఎలా మానవో అలాగే కష్టాలు రాకూడదని ప్రార్థించినా రాక మానవు. తుఫాను వల్ల ఎలా మనకి ప్రయోజనం ఉంటుందో అప్పుడు తెలీకపోయినా కష్టాల వల్ల కూడా మనకి ప్రయోజనం ఉంటుంది.’’
‘‘అర్థమైంది. మా నాన్న పనిచేసే కంపెనీ దివాలా తీసి ఉద్యోగం పోతే కష్టం అనుకున్నాం. కానీ దాని పోటీ కంపెనీలో ఇంకా మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది.’’ శస్త్రుగ చెప్పింది.
‘‘కాబట్టి కష్టాలతో పాటు దేవుడి ఆశీర్వచనాలు కూడా మనకి అందుతూంటాయి.’’ మామయ్య నవ్వుతూ చెప్పాడు.
‘‘ ఇప్పుడు దేవుడు మనకి తుఫానులు ఎందుకు పంపుతున్నాడో నాకు అర్థమైంది. కష్టాలని కూడా.’’
తుఫాను తగ్గాక శస్త్రుగ కుటుంబ సభ్యులు తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. శస్త్రుగ ఆగి ఆకాశంలోకి చూసి వెనక్కి తిరిగి మామయ్యతో గట్టిగా చెప్పింది.
‘‘చూడు మామయ్యా! దేవుడి ఆశీర్వచనం.’’
పైన ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు అందరికీ కనిపించింది.
*

మల్లాది వెంకటకృష్ణమూర్తి