రాష్ట్రీయం

టిడిపిలోకి వెళ్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆనం సోదరుల వెల్లడి

నెల్లూరు , నవంబర్ 26: తన సోదరుడు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డితో కలసి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం నెల్లూరు నగరంలోని తన స్వగృహంలో అనుచరగణంతో సమావేశమయ్యారు. గత రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌పార్టీలో కొనసాగానని, అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందనీ అన్నారు. గడచిన ఎన్నికల్లో ఐదుశాతం కాంగ్రెస్‌కు అనుకూలత ఉంటే ఇప్పుడు 2.8శాతానికి తగ్గిపోయిందన్నారు. అందువల్ల తమను నమ్ముకున్న ప్రజల కోసమే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను వీడటం ఎంతైనా బాధాకరమేనన్నారు. ఇదిలావుండగా కొన్నాళ్లక్రితమే ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జయకుమార్‌రెడ్డి తెలుగుదేశంలో చేరారు. కాగా తమ పార్టీలోకి వస్తావా రావా అంటూ తెలుగుదేశం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఒత్తిడి చేస్తున్నారని కూడా ఈ సందర్భంలో వెల్లడించారు. త ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశంలోకి వెళ్లడమే శ్రేయస్కరమని భావిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌సి నేతలతో కలసి అడుగులు వేయాలంటే సరిపడని వ్యవహారమన్నారు. అటునుంచి కూడా ఆహ్వానం అందినా తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. వైఎస్ మరణించినప్పుడు కొన్నాళ్లపాటు వారి వెంట కొనసాగినా ఇబ్బందులే ఎదురయ్యాయి తప్ప ప్రయోజనం లేకపోయిందని వివరించారు. గతంలో తాను పదేళ్లపాటు తెలుగుదేశంలో కూడా విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా ఆనం సోదరులు రాజీనామా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరా..వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు తెలిపారు.