కడప

అండగా నిలిస్తే అవమానించి పంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, మార్చి 7: వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో 1989 నుండి అండగా వున్నది దేవగుడి కుటుంబమేనన్న విషయాన్ని వైకాపా నేతలు మరువకూడదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆది మాట్లాడుతూ వైకాపా నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అవమానకరమైన పరిస్థితుల్లోనే వైకాపా నుండి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. 1989లో రాష్టవ్య్రాప్తంగా హవా వున్న అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలో జమ్మలమడుగులో 30వేల తక్కువ మెజార్టీ వచ్చిన పరిస్థితుల్లో పరిస్థితుల్లో దేవగుడి కుటుంబమే జమ్మలమడుగులో వైఎస్ కుటుంబానికి అండగా నిలిచామన్నారు. ఏజెంట్లను కూర్చబెట్టుకోలేని పరిస్థితుల నుండి జమ్మలమడుగు ప్రాంతంలో వైయస్‌కుటుంబానికి రాజకీయంగా పరిస్థితిని చక్కబెట్టింది దేవగుడి కుటుంబమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వైకాపా నేతలకు 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపిగా వున్నప్పుడు జగన్ అధిష్ఠానంపై తిరుగుబాటుచేయడం, విమర్శలు చేయడం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అధికారం కోసమే అయితే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని వీడిన ఎందుకు జగన్‌తోపాటు నడిచామన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటువున్న పరిస్థితుల్లో యుక్తితో అభివృద్దికోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిపై వైకాపా నేతలు విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ది విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రామసుబ్బారెడ్డిని కలుపుకొని నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని ఆది పేర్కొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే భీమశివారెడ్డి మృతి
* ఆసుపత్రి ఎదుట బిజెపి నాయకుల ధర్నా
పులివెందుల, మార్చి 7: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు సోమవారం భీమశివారెడ్డి మృతుని బంధువులు, బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం వేల్ల శివారెడ్డి మృతిచెందాడని, వెంటనే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వివరాలలోకి వెళితే వేముల మండలం వెంకటేశపురం గ్రామానికి చెందిన భీమశివారెడ్డి (35) అనే రైతు అప్పులబాధ తాళలేక ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఆయన కుటుంబీకులు శివారెడ్డిని ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రిలో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడు పవన్‌కుమార్‌రెడ్డి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించాడని, భీమశివారెడ్డి సేవించిన పురుగులమందు సీసాను కూడా మృతుని బంధువులు తెచ్చారని, అందులో వున్న విరుగుడు మందును వెంటనే ఇవ్వాలని కోరామని వారు అన్నారు. అందుకు వైద్యుడు స్పందిస్తూ ఇతనికి ఏమీ కాదంటూ, భయపడకండని ఆసుపత్రిలో విధులు నిర్వహించకుండా పులివెందులలో నెలకొల్పిన ప్రైవేట్ క్లినిక్‌లో పనిచేసుకుంటూ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించాడని, అందువల్లే శివారెడ్డి మృతిచెందాడని వేముల మండల బిజెపి నాయకుడు శివనాగేశ్వరరెడ్డి అన్నారు. వైద్యులు వెంటనే స్పందించి విరుగుడుమందు ఇచ్చివుంటే ప్రాణనష్టం జరిగేది కాదని, ఇలాంటి వైద్యులను ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడు రఘు వారితో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేస్తామని, నిరసన విరమించాలని, మీకు న్యాయం జరిగేలా చూస్తామని సూపరింటెండెంట్ తెలియజేశాడని, మృతుని కుటుంబానికి న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. అనంతరం పులివెందుల పట్టణ బిజెపి అధ్యక్షుడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి నందు వౌళిక వసతులు కల్పించాలని, పేరుకే వంద పడకల ఆసుపత్రిగా వుందని, కానీ ఆమేరకు ఇక్కడ చికిత్సా సౌకర్యం లేదని, సిబ్బంది కొరత కూడా వుందని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రోడ్డుప్రమాదంలో లారీడ్రైవర్ మృతి
రైల్వేకోడూరు, మార్చి 7:మండలంలోని శెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని కడప-చెన్నై ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబ్బార్ (42) అనే లారీడ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై శివప్రసాద్ సోమవారం తెలిపారు. కడప నుంచి చెన్నై వెళుతున్న ఈ లారీ శెట్టిగుంట స్టేషన్ సమీపంలో ఓ డాబా వద్ద ఆపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడక్కడే డ్రైవర్ మృతి చెందాడు.