ఆంధ్ర గాథాలహరి

ఊరికి సుఖ నిద్ర కలికికి కలత నిద్ర-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
పహరవణ మగ్గ విసమే జా ఆ కి చ్ఛేణ లహఇసే ణద్దం!
గామణి ఉత్తస్స ఉరేపల్లీ ఉణ సా సుహం సువఈ (అంగరాజు)
సంస్కృత ఛాయ
ప్రహారవ్రణమార్గవిషమే జాయా కృచ్ఛేణలభతే తస్యనిద్రామ్
గ్రామణీ పుత్య స్యోరసి పల్లీ పునః సా సుఖం స్వాపితి

తెలుగు
తే.గీ కరకు యుద్ధాల తగిలిన, కత్తిపోట్లు
ఎగుడు దిగుడు చేసెను, వని ఎదను మిగుల
నిద్దరోయెను ఊరెల్ల నిర్భయముగ
నిజ సతికి మాత్రము, కలతనిద్రమిగిలె
అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళోనే అనేక యుద్ధాల్లో పాల్గొన్న మహాయోధుడున్నాడు. యుద్ధాల్లో తగిలిన కత్తిపోట్ల గాట్లవల్ల అతని ఎద ఎగుడు దిగుడుగా మారింది. అంతటి వీరుడు ఊళ్ళో ఉన్నాడని ఊరంతా నిర్భయంగా నిద్రపోతోంది. కానీ, ఆ వీరుడి భార్య మాత్రం అతని ఎగుడు దిగుడు ఎదమీద సరిగా నిద్రపోలేకపోతోందట. వూర్లో గొప్ప యోధుడు ఉన్నాడంటే శత్రువులకు, దొంగలకు అపరిమితమైన భయం ఉంటుంది కదా. వారికి ఎలా భయముంటుదో వూర్లో నివాసితులకు మాత్రం అంత నిర్భయత్వం ఉంటుంది. ఎందుకంటే మనకేం వీరుడు యోధుడు మనలను రక్షించడానికి అప్రమత్తంగా ఉన్నాడు కదా. మరి గుండెల మీద చేయ వేసుకొని హాయగా నిద్రపోదాం అనుకొన్నారట. కాని అక్కడే వచ్చింది చిక్కంతా వూరివారు కోరుకున్నట్టుగా నే వీరుడు ఉన్నాడు. కాని ఆ వీరుని భార్య మాత్రం కలతనిద్రలోనే ఉందట. ఎందుకంటే సమరుథలు, యోథులైన వాళ్ల ఇళ్లల్లో ఉంటే ఎపుడు ఎవరు వచ్చి సాయం అడుగుతారో, వారివెంట వీరు వెళ్లిపోతారనే దిగులుఆమెను ఆశ్రయంచి ఆమె నిద్రను దూరం చేసిందట. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949