ఆంధ్ర గాథాలహరి

జయహో మహిళామణీ!-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృత మూలం
కిం కిందే పడిహాసఇ సహీ హిం ఇఅపుచ్ఛి ఆ ఏం ముద్ధాఏ
పఢముగ్గ అదోహణ ఏంణవరం దఇఅంగ ఆ దిట్ఠీ (గజసింహుడు)

సంస్కృత ఛాయ
కింకిం తే ప్రతిభాసతే సఖీ భిరితి పృష్టయా ముగ్ధయాః
ప్రథమోద్గత దోహదిన్యాః కేవలం దయితం గతా దృష్టిః
నువ్వే కావాలి
ఆ.వె తోయజాక్షి యొకతె తొలిచూలు దాల్చంగ
‘అడుగుమేదివలయు?’ అనగ చెలులు
మగని ముఖమువంక మధురంబుగా జూచి
సిగ్గుతోడ నామె శిరము వంచె

ఒక యువతి తొలిసారిగా గర్భం ధరించింది. అమ్మలక్కలంతా చుట్టూ చేరారు. ‘‘గర్భంతో వున్నవాళ్లకు ఏవేవో కోరికలుంటాయి కదా! నీకేం కావాలో అడుగు’’ అన్నారు. దానికి ఆమె మొగుడి వంక మధురంగా ఒక చూపు చూచి సిగ్గుతో తలవంచుకుంది. అంటే ‘నా మొగుడే నాకు సర్వస్వం అతని ప్రేమ తప్ప నాకింకేమీ అక్కర్లేదని’ ఆమె చెప్పకనే చెప్పిందన్నమాట.
సహజంగా ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఏవేవో కోరికలు కోరడం వాటిని భర్తలు ఇష్టంగా తీర్చడం మన సంప్రదాయం. కానీ ఇక్కడ భర్త పేదవాడు. అందువల్ల ఆమె ఏమీ కోరినా అతడు తీర్చలేక నలుగురిలో పలుచనై పోతాడు. అందుకే ఇంటి గుట్టు కాపాడడానికి ఆమె ఏమీ కోరకుండా మధురంగా నవ్వి వూరుకొందన్నాడు గాధాకారుడు.
ఇలా గుప్తంగా భర్తల మానప్రాణాలను కాపాడుతున్న భారతీయ మహిళా మూర్తులెందరో!

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com