ఆంధ్ర గాథాలహరి

పరిహాసమా? పరితాపమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
జం జంసో ణి జ్ఘా అఇ అంగో ఆసం మహం అణిమిస చ్ఛో
పచ్ఛాఏమి అతం తం ఇచ్ఛామి అతేణ దీసంతం!! (వసంతకుడు)
సంస్కృత ఛాయ
యద్యత్స నిర్థ్యాయత్యం గావకాశం మమానిమిషాక్షః
ప్రచ్ఛాదయామి చతం తమిచ్ఛామిచతేన దృశ్యమానమ్

తెలుగు
ఆ.వె
హృదయగతుని చూపు, ఇంపుగూర్చు చెలికి
చలువరేని గన్న కలువయట్లు
ఆకలిగల చూపు అత్తిపత్తిని జేయు
హరిని జూచి వణుకు హరిణమట్లు
ఇష్టమైన మనసు దోచిన చెలికాని చూపు అతివకు చంద్రుణ్ణిచూచిన కలువలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదే ఆకలి చూపులు, ఆబగా ఒంటిని తడుముతూంటే శరీరం కుంచించికుపోతుంది. పైగా సింహాన్ని చూచిన లేడి పిల్లకు వలె భయం కలుగుతుంది. కన్య మనసుదోచిన మగవానికి సంతోషం, కన్యకామణికి పరమ సంతోషం కలుగుతాయ. ఆ కన్యకు ఇష్టం లేకుండా బలవంతంగా చూపులు కలిపితే ఆ కన్య కాళికాదేవి అవుతుంది. మగవాడు పగవాడుగా మారుతాడు. అపరకాళిగా మారి ఆ పగవాని అంతం చూడాలను కొంటుంది. అందుకే ముందు మంచి వానిగా మారి మగువ మనసు గెలుచు కోవాలి. ఆ తరువాతే తన ప్రతాపమో, ప్రేమో చూపించాలి. కాని అమ్మాయకి ఇష్టం లేకుండానే వెర్రి వేషాలు వేయగూడదనే నిత్య సత్యాన్ని ఆనాడే గాధాకారుడు చెప్పాడు. నేటికీ ఇదినిజమే కదా.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949