ఆంధ్ర గాథాలహరి

గిరిజన పదములు-112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె విరులనలరు తరులు, విమలమైన ఝరులు
కదలిపోవు కరులు, గండశిలలు
వలచి నాట్యమాడు, వనమయూరమ్ములు
గిరిజనులకు నందకరములెపుడు

ఈ గాథ ఒక అందమైన ప్రకృతి వర్ణన. విరిసిన పూలతో అందంగా వున్న కదంబ వృక్షాలు, కడిగిన ముత్యాల్లా మెరుస్తున్న గండశిలలూ, ఆనందంతో నర్తన చేస్తున్న సుందర వన మయూరాలూ, గలగల పారే సెలయేళ్ళూ- కొండ ప్రాంతాలలో నివసించేవారిని నిత్యోత్సాహం కలిగిస్తాయని ఈ గాథ సారాంశం. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నవాళ్ళు చిరకాలం జీవించడంలో ఆశ్చర్యం లేదు. చైనాలో ఒక కొండ ప్రాంతం ఉందట. ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది శతాధిక వృద్ధులున్నారట. కారణమేమిటా అని ఆరా తీస్తే కొండ ఎక్కి దిగడంవల్ల వ్యాయామం, స్వచ్ఛమైన గాలి వారి చిరాయువుకు హేతువులని తేలింది. అందువల్ల ప్రకృతితో మమేకమై జీవిస్తే ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటామన్నమాట.

ప్రాకృతమూలం

పప్ఫుల్ల ఘణకలంబా ణిద్ధో అసిలా అలా ముఇ అమోరా!
పసరంతో జ్ఘరముహలా ఓసాహంతే గిరిగ్గామా
సంస్కృతచ్ఛాయ
స్రోత్ఫుల్ల ఘనకదంబా నిర్దౌత శిలాతలా ముదిత మయూరాః
ప్రసరన్నిర్ఘర ముఖరా ఉత్సాహయంతి గిరిగ్రామాః
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949