ఆంధ్ర గాథాలహరి

భానుమూర్తీ! నీకు వందనం-113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె అవనికింపుగూర్చు అరుణ కిరణుడవు
నభము దాల్చినట్టి నగవు నీవు
రాత్రి మరొకచోట రాజిల్లువాడవు
భానుమూర్తి! నీకు వందనమ్ము

ఇది ఒక సూర్యస్తుతి. ‘‘చూచేవారికి ఆనందం కలిగించేవాడవు, ఉదయ సంధ్యలో ఎర్రని కిరణాలు గల్గినవాడవు. రాత్రిపూట వేరొక చోటకు వెళ్లి ప్రకాశించేవాడవు, ఆకాశమునకు ఆభరణమైన వాడవు అయిన ఓ దినపతీ! సూర్యదేవా! నీకు నమస్కారము’’.
వివరణ: సూర్యుడు ప్రత్యక్షదైవం. సూర్య ఆరాధన మన జీవన విధానంలో అనాదిగా ఉన్నదే. యుద్ధరంగంలో శ్రీరాముడు సైతం అగస్త్యమహర్షి సూచనతో సూర్యుని ఆరాధించాడు. అలా లోకానికి అందించబడినదే అపురూపమైన ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పఠించడంవల్ల ఆరోగ్యం సమకూరుతుందని అనాదిగా మన విశ్వాసం.
ప్రాకృతమూలం
ప చ్చూసాగఅ రంజి అదేహపి ఆలోఅ లోఅణాణంద
అణ్ణత్త ఖివి అసవ్వరి ణహ భూసణ దిణవఇ ణమోదే
సంస్కృతచ్ఛాయ
ప్రత్యూషాగత రక్తదేహ ప్రియాలోక లోచనానంద
అన్యత్ర క్షపిత శర్వరీక నభో భూషణ దినపతే నమస్తే
*
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949