ఆంధ్ర గాథాలహరి

సొంతంగా బ్రతుకు -114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె: నా కుమారుడనని, నా గొప్ప చేతనే
సుతుడ! వ్యర్థముగను బ్రతుకబోకు
జగతిలోన నాకు నగుబాటు తేబోకు
మనియె, గ్రామ పెద్ద అంత్యమందు
భావం: ‘‘నా కుమారుడనని చెప్పుకుంటూ పనీ పాటా లేకుండా వ్యర్థంగా బ్రతుకబోకు. నాకు చెడ్డపేరు తేబోకు. యుక్తంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకొమ్మని’’ తన పుత్రునికి అంత్యకాలంలో హితబోధ చేస్తున్నాడు గ్రామపెద్ద.
వివరణ: వారసత్వంకన్నా, జవసత్వం మిన్న అని పదే పదే అంటూంటారు మనపెద్దలు. ఆమాట అక్షరసత్యం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులను, పేరుప్రతిష్ఠలనూ అనుభవిస్తూ పండిత పుత్రులుగా జీవించేవారికీగాథ ఒక గుణపాఠం. స్వయంగా సంపాదించి సాధించుకున్న సిరిసంపదలు, గౌరవమే మనసుకు సంతృప్తినిస్తాయి. ‘ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం’ (స్వయంగా సంపాదించుకున్న ధనమే ఉత్తమం, పిత్రార్జితమైన ధనం మధ్యమం) అని మనకు తెలిసిందే కదా!
ప్రాకృతమూలం
అప్పా హేఇ మరంతో పుత్తంపల్లీ వఈప అత్తేణ
మహణామేణ జహతుమం ణలజ్జసే తహ కరేజ్ఞాసు
సంస్కృతచ్ఛాయ
శిక్షయతి మ్రియ మాణః పుత్రం పల్లీపతిః ప్రయత్నేన
మమనామ్నాయ థాత్వన లజ్జసే తహకరే జ్జాసు
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949