ఆంధ్ర గాథాలహరి

హర నమః పార్వతీపతయే!-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె అర్ఘ్యమిచ్చువేళ హస్తయుగ్మంబునన్
పార్వతి వదనంబు ప్రతిఫలింప
మంత్రములను పలుక మరచి, మైమరిచిన
నాగభూషణునకు నతుల నిండు

అర్ఘ్యమిద్దామని పరమేశ్వరుడు దోసిట్లోకి జలాన్ని తీసుకున్నాడు. ఆయన అర్థనారీశ్వరుడు కాబట్టి జలంలో పార్వతీ దేవి ముఖ పద్మం ప్రతిఫలించింది. అంత పరమేశ్వరుడు మైమరచిపోయి మంత్రాలను ఉచ్ఛరించడం మాని కేవలం పెదవులను మాత్రమే కదిలించాడట. అట్టి పరవశుడైన పరమేశ్వరునకు నమస్సులు అని ఈ గాథ యొక్క భావం. జగత్తుకు మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులు మనకందరికీ శుభములనొసగుగాక!

ప్రాకృతమూలం

సంఝా గహి అజలంజలి పడిమాసం కంత గోరి ముహకమలమ్
అలిఅం చిఅ పురిఓట్ఠం విఅలి అమంతం హరంణమహ
సంస్కృతచ్ఛాయ
సంధ్యాగృహీత జలాంజలి ప్రతిమాసం క్రాంతగౌరీ ముఖకమలమ్
అలీకమేవ స్ఫురితోష్ఠం విగలిత మంత్రం హరంనమత
ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949