ఆంధ్ర గాథాలహరి

సర్వసన్మంగళాని భవన్తు-117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామాట
ఆ.వె దొడ్డవరమువాడ! దొడ్డవంశమునందు
ప్రభవమందినాడ! ప్రాజ్ఞులార!
నన్ను జనులు, సత్యనారాయణుండంద్రు
సుబ్బరామ యాఖ్యుసుతుడ నేను
ఉ చిక్కని భావజాలములు చేతన గూర్చెడు లోకవృత్తముల్
మక్కువ మీరగా నరసి మంజుల శబ్దము తీర్చికూర్చియున్
అక్కజమైన రీతి సకలాంధ్ర జనావళి మోదమందగన్
చెక్కితి పద్య శిల్పముల చిత్తమునందున చింతసేయుచున్
క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాల భూపాలుని గాథాసప్తశతిలోని కొన్ని గాథలను స్వీకరించి సరళమైన తెలుగు పద్యాలరూపంలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది యథాతథానువాదం మాత్రం కాదు. మూలంలోని భావాన్ని అనువాదాల సహకారంతో గ్రహించి నా సొంతమాటల్లో చెప్పే ప్రయత్నంచేశాను. కేవలం సామాన్యులకోసం చేసిన ప్రయత్నమే ఇది. కారణం నేనూ సామాన్యుణ్ణే. పండితుణ్ణికాదు. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రగాథాలహరిగా అందమైన బొమ్మలతో సహా ప్రచురించి వెలుగులోకి తెచ్చిన సదాశివమయమైన ‘ఆంధ్రభూమి’ దినపత్రికకు మనఃపూర్వక ధన్యవాదాలు.
కృతజ్ఞతాపూర్వకగా ‘ఆంధ్రభూమి’కో పద్యసుమం
ఆ.వె అఖిల భావాల కద్దంబు ‘ఆంధ్రభూమి’
న్యాయపక్షంబు నిరతంబు ‘ఆంధ్రభూమి’
వ్యాసమండిత పీఠమ్ము ‘ఆంధ్రభూమి’
అచలమై నిలుచునుగాక! ‘ఆంధ్రభూమి’
శుభమస్తు !

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949