ఆంధ్ర గాథాలహరి

గగనాంగి కంఠహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఉఅ పోమ్మరా అమరగ అసంవలి ఆణహ అలా ఓఓ అరఇ
ణహసిరి కంఠబ్బట్ఠవ్వ కంఠి ఆ కరం రిం ఛోలీ!! (వాసుదేవుడు)
సంస్కృత ఛాయ
పశ్య పద్మరాగ మరకత సంవలితాన భస్త లాదవతరతి
నభ శ్రీ కంఠ భ్రష్టేవ కంఠికా కీర పంక్తిః
తెలుగు
తే.గీ గగనతలము నుండి భువికి దిగుశుకముల
పంక్తి జూడంగ, కెంపులు పచ్చలుగల
కనకహారమ్ము, గగనాంగి కంఠసీమ
నుండి జారెడు రీతిగా నొప్పచుండె
ఆకుపచ్చని శరీరాలు, ఎర్రని ముక్కులు గల చిలుకల వరుస భూమిమీదకు వరుసగా వాలుతుంటే, గగన సుందరి కంఠసీమనుండి కెంపులు, పచ్చలు పొదిగిన హారం భూమి మీదకు జారుతూన్నట్లుగా ఉంది- అని ప్రేయసితో ప్రియుడు వర్ణిస్తున్నాడు.
నిజమే! అద్భుతమైన వర్ణన. ప్రకృతిని చూసి పరవశించని వారు ఎవరు ఉంటారు. పరమేశ్వరుని సృష్టే అయనా రసజ్ఞుల కది రమ్యమైన కాన్వాస్. ప్రతి కవి పరుచుకున్న పచ్చని పచ్చిక చూసి చిలకాకుపచ్చ చీర కట్టుకున్నభూదేవి అంటారు. గగనాన వెల్లివిరిసిన హరి విల్లు చూసి భూదేవి కురుల్లో కుదురు కున్న కదంబం అని వర్ణి స్తారు. ఆస్వాదించే మనసు ఉండాలి కాని ప్రకృతిలోని ప్రతివస్తువు అవస్తువు సైతం కనులకింపుగా కనిపిస్తుంది. మనసును దోచేస్తుంది. ఇక ప్రేయసీ ప్రియులకు ప్రకృతి అంతా తమలాగే అందాన్ని ఆస్వాదిస్తోంది అనిపిస్తుంది. అట్లా ఆలోచించే ప్రియుడు కనుకనే ఆకాజుడు భూదేవికి పంపిస్తున్న కంఠహారం లాగా చిలుకల వరుస కనిపించింది.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949