ఆంధ్ర గాథాలహరి

తుమ్మెదలు కావు ఇవి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
భరిమోసే గహ ఆహరధు అసీస పహూ లిరాల ఆ ఉలి అమ్
బ అణం పరిమళతరలి అభమరాలి పఇ ణ్ణకమలం వ! (ముక్త్ధారుడు)
సంస్కృత ఛాయ
స్మరామస్తస్యా గృహీతాధర ధుత శీర్ష ప్రఘార్ణన శీలాకాకులితమ్
వదనమ్ పరిమళ తరళిత భ్రమరాళి ప్రకీర్ణకమలమివ తెలుగు
తే.గీ
సుదతి నీలాల కంబుల సొగసు గాంచి
పరమ భావుకుడౌ పతి పలికెనిట్లు
నీ ముఖము వికసిత నవనీరజమ్ము
వేగ మకరందమును గ్రోలమూగినట్టి
భ్రమరకములు నీదు కురులు, రాజవదన
అసలే భావుడు, ఆపైన భార్య తలస్నానం చేసి కురులారబెట్టుకోవడం గమనించాడు. అప్పుడు ‘‘ఓ చంద్రవదనా! నీ ముఖం వికసించిన పద్మం, నీ కురులు పద్మంలోని మకరందన్నా గ్రోలడానికి మూగిన తుమ్మెదల గుంపు’’ అని వర్ణించాడు.
నిజమే భావుకునికి యథార్థ విషయాలు కూడా వూహకు అనుగుణంగా కనిపిస్తాయ. కురులను తుమ్మెదలతో పోల్చడం కవుల పని. అందుకే అందమైన తన సతి ముఖపద్మాన్ని తనకన్నా ముందుగా ఆమె కురులు ముద్దాడుతూ తనకు పోటీ వస్తున్నాయని అసూయతో ఈ విధంగా అంటున్నాడు. తనది అనుకొన్న సొమ్ము పరాయవాళ్లు తీసుకొం టారే మోనన్న భయం సొమ్ము గలవాళ్లకు ఉంటుంది కదా. అదే భయం వారిని నిలువనీయదు. ఎవరు వచ్చినా ఆ సొమ్ము అపహరణకు అనుకొంటారే కాని కాపుకు అనుకోరు అట్లానే ఈ భావుకుడు కూడా కురులు ఛత్రంగా మారి ఆయన సతి ముఖపద్మాన్ని రక్షించడానికి వచ్చినప్పటికీ తన సతిముఖపద్మంలోని మకరందాన్ని గ్రోలడానికి వచ్చాయేమో అని అనుమానపడుతున్నాడు. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949