ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ముహమారుఏణ తం కహ్ణ గోర అం రాహి ఆఏ అవణేంతో
ఏతాణ వల్లవీణం అణ్ణాణ విగోరఅం హరసి (పొట్టిసూడు)
సంస్కృత ఛాయ
ముఖమారతేన త్వం కృష్ణ గోరజోరాధికాయా అపనయన్
ఏతాసాం వల్లవీనా మన్యాసామపి గౌవరం హరసి
తెలుగు
ఆ.వె గోపబాల! నీవు గోధూళివేళలో
రాధ కంటిలోని రజమునెల్ల
ఊది వైచినంత ఊసరంబైపోయె
సర్వగోపికాళి గర్వచయము
కృష్ణుడికి మేము దగ్గరంటే మేము దగ్గర అని గోపికలంతా ఎవరికివారు భావిస్తూ ఉంటారు. కానీ కృష్ణా! రాధ కంటిలో పడిన గోధూళిని నీవెప్పుడైతే నోటితో ఊది తీసివేసినావో అప్పుడే ఇతర గోపికల గర్వమంతా తీసివేయబడింది’’ అని గాథ. కృష్ణుడు తనకు రాధ ఎంత దగ్గరో చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఈగాథలోని అంతరార్థం.
వివరణ:- వాక్కుకు అర్థం ఎంత దగ్గరో, చంద్రునికి వెనె్నల ఎంత దగ్గరో, పూవుకు సువాసన ఎంతదగ్గరో, రాధకు కృష్ణుడు అంత దగ్గర. మరి కృష్ణుని కి నేనంటే నేనే దగ్గరనుకొనే ఈ గోపికలెంత అమాయకులో కదా. అసలు కృష్ణమాయలో పడినవారిలో ఎవరికి వారు కృష్ణుడు తమకుమాత్రమే చెందినవాడు. తమకే సొంతం అనుకోవడం సహజమే కదా.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949