ఆంధ్ర గాథాలహరి

కష్టంతోనే ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం

ఆరంభం తస్స ధు అం లచ్ఛీ మరణం విహో ఇపురిసస్స
తం మరణ మణారంభే విహో ఇ లచ్ఛీ ఉణణ హోఇ

సంస్కృత ఛాయ

ఆరభమాణస్య ధ్రువం
లక్ష్మీ ర్మరణం వాభవతి పురుషస్య
తన్మరణు మనారంభేపి భవతి
లక్ష్మీః పునర్నభవ

తెలుగు

కష్టపడినయంత, కలుగు విజయలక్ష్మి
కాలగతిని, మృతియు కలుగవచ్చు
పాటుపడక, ఎట్టి పనిపాట లేకున్న
మరణమెట్లు తప్పు? మాన్యతెట్లు

వివరణ

పనీ పాటా లేకుండా సోమరిపోతుగా మారినవాడికి నీతి చెబుతున్న గాథ ఇది. కష్టపడితే విజయం వరిస్తుంది. మరణమనేది ఎలాగూ కాలంతోపాటు వస్తుంది. అసలు కష్టపడకుండా ఊరకే కూచున్నా మరణం రాకుండా ఉండదు. పైగా సమాజంలో గౌరవం కూడా వుండదు. అందువల్ల కష్టపడి పనిచేసి గౌరవంగా బ్రతకమని సలహా ఇస్తున్నాడు- గాథాకారుడు.
కష్టేఫలి , శ్రమయేవ జయతే ఇత్యాదులు మన భారతీయ ఆలోచనా ధారలో అనాదిగా ఉన్నవే. మరణానికి భయపడి వూరకే కూర్చుందే అది రాకుండా ఉండదు. పనిగండం అని కొద్దిమంది వూరికే కబుర్లు చెబుతారు కాని పనిమాత్రం చేయరు. అలాంటి వారినుద్దేశించి ఇక్కడ చెబుతున్నారు.
మరణానికి భయపడి కూర్చున్నా అది రాకుండా ను ఉండదు. అలాగనే దానికోసమేఎదురు చూస్తూ కూర్చున్నా అది నీవు అనుకొన్నప్పుడు రాదు. అందుకే మరణం ఆసన్నమైనప్పుడు ఏపరిస్థితుల్లో ఉన్నా తప్పించుకున్నవారెవరూ ఇంతవరకు భూమీద లేరు. కనుక బ్రతికి ఉన్ననాళ్లు ఏదో ఒక పని చేయాల్సిందే. అంతేకాని బద్దకంగా కూర్చోవడం మనిషి మనసుకు మెదడుకు కూడా మంచిది కాదు. చైతన్యవంతంగా, ఉన్నతంగా, ఉన్నంతలో ఇతరులకు మేలు చేస్తూ లేకపోయనా ఇతరులకు కీడు చేయకుండా ఉన్నా మేలే.
అంతేకాని పరాన్నభుక్కులాగా మనిషి ఉంటే అతనికి పరాన్నజీవికి తేడా ఉండదు. మనిషిగా పుట్టి కాళ్లు చేతులు మెదడు అన్నీ భగవంతుడు ఇచ్చినా కాని సోమరిపోతుగా కూర్చోవడం తగదు.

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com