ఆంధ్ర గాథాలహరి

మల్లెలు కట్టిన దారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృత మూలం
సుఅణో జందేస మలంక రేఇ తం వి అకరే ఇపవసంతో
గామాసణ్ణుమ్లూ అమహావడట్ఠాణసారిచ్ఛం (హరకుంతుడు)
సంస్కృత ఛాయ
సుజనోయం దేశ మలం కరోతి తమేవ కరోతి ప్రవసన్ గ్రామాసప్నోన్మూలిత మహావట స్థాన సదృశం
తెలుగు
ఆ.వె ఉత్తమాత్ముడొకడు, ఊరిని వీడంగ
బోసిపోవు, ఊరి వాసి పోవు
వెఱ్ఱిగాలివాన మఱ్ఱిని గూల్చంగ
మొక్కలెట్లు లోటు పూడ్చగలవు
ఊరిలోంచి ఒక ఉత్తముడు వెళ్లిపోతే ఊరే బోసిపోయినట్లుంటుంది. ఒక పెద్ద మఱ్ఱిచెట్టు పడిపోతే ఎన్ని మొక్కలు మొలిచినా మఱ్ఱిచెట్టును ఆధారంగా చేసుకొని పూర్వకాలంలో ఎన్నో సంసారాలుండడం కూడా మనకు తెలిసిందే కదా!
వివరణ: మాన్యు లైనవారివల్ల వూరికి, వూరిలోని జనానికి మంచి పేరు వస్తుంది. మల్లెకట్టిన దారంలాగా , దారానికి ఏవిధమైన సువా సన లేకపోయనా మల్లెలు కట్టడానికి ఉపయోగ పడింది కనుక దారానికి మల్లె వాసన వస్తుంది. అట్లానే ఇంగువ కట్టిన గుడ్డ అంటారు. ఇంగువతోఉన్నది కనుక ఆ వాసన గుడ్డకు కూడా అంటుంది. అట్లానే జ్ఞానులో, పండితులో వారు ఉన్న చోటను సారవంతం చేస్తారు. వారు చెప్పే నీతివాక్యాలను విని సామాన్యులు సైతం మంచిదారిలో నడిచి అసామాన్యులు కావాలని గాధాకరుని సూచన. అంతేకాదు ఉత్తములు, మేధావులైన వారిని వూరివారందరూ ఒక్కమాట మీద గుర్తించి, గౌరవించి వారిని అక్కడే నిలుపుకోవాలని ఈ గాథలోని సూక్తి. ఏవీ లేని వూర్లో ఆముదం చెట్టే పెద్ద వృక్షమైనట్టు తయారవుతుంది. పైగా ఆ ఆముదం చెట్లకే దోట్లు వేసేవారు తయారు అవుతారు. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949