ఆంధ్ర గాథాలహరి

మరో దారి పక్కనే ఉందిగా -8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృత మూలం
కిం రు అసి ఓణ అముహీ ధవలా అంతేసు సాలిచ్ఛేత్తేసు
హరి ఆలమండి అముహీణడివ్వసణవాడి ఆ జాఆ (మహేంద్రుడు)

సంస్కృత ఛాయ
కిం రోదిష్య వనత ముఖీ ధవళాయ మానేషు శాలిక్షేత్రేషు
హరితాల మండిత ముఖీ నటీవ శణవాటి కాజాతా
తెలుగు
ఊరడింపు

తే.గీ పంట కోతకు వచ్చియు వాలినట్టి
వరిపొలముగాంచి హృది కలవరము చెందు
సఖియ నూరడించుచు ప్రియసఖియబలికె
‘కను’ మదె ఎదుగుచున్నది జనప చను!’’

ఆమె ప్రియుణ్ణి రోజూ కలుసుకునే సంకేతస్థలం ఆ వరిపొలం. వరి పంట కోతకు వచ్చినందువల్ల క్రమంగా అది వాలిపోతోంది. ‘సంకేతస్థలం కనుమరుగవుతోందే!’ అని మనసులో బాధపడుతూ ఆ పొలం వంక దీనంగా చూస్తున్న చెలిని ఓదారుస్తూ ఆమె ఇష్టసఖి ‘ఎందుకే బాధపడతావ్! ప్రక్కనున్న జనపచేను చూడు ఎలా ఎదిగి వస్తోందో!’’ అంటూ నీకు మరో సంకేతస్థలం సిద్ధమవుతోందని ఊరడించింది.

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com