ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి-- 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకృతమూలం
ధఠి ఓ ధరిఓ వి అలఇ ఉ అఏసో పిహసహీహిదిజ్జంతో
మ అరద్ధ అబాణ పహార జజ్జరే తీఏ హి అ అమ్మి (మానుడు
సంస్కృత ఛాయ
ధృతో ధృతో విగలత్యుపదేశః ప్రియసఖీ బిర్దీయ మానః
మకరధ్వజ బాణ ప్రహార జర్జరే తస్యా హృదయే
తెలుగు
ఆ.వె పంచశరు శరముల ప్రహరణమువలన
చిత్తమందు చెలికి, చిల్లులవగ్గ
చెలలు సేయునట్టి, పలు ఉపదేశముల్
నిలువకుండె మదిని నీరమట్లు
చెలులు చేసే నీతి బోధలేవీ ఆమె చెవికెక్కడం లేదు. అందుకు చెలులు ‘‘మన్మథుని బాణాలవల్ల ఆమె మనస్సుకు చిల్లులు పడ్డాయి. మనం చెప్పే బోధలన్నీ జల్లెడ మీద పడ్డ నీటిలాగా జారిపోతున్నాయి’’ అంటూ చమత్కరించారు.

--ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949