ఆంధ్ర గాథాలహరి

ఊహే మధురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
కమలా అరా ణమలిఆ హంసా ఉడ్డావిఆ ణ అపిఉచ్ఛా!
కేణాపి గామత డాఏ అబ్భం ఉత్తాణ అం వ్యూఢమ్ (మృగాంకుడు)

సంస్కృత చ్ఛాయ
కమలాకర నమృదితా హంసా ఉడ్డాయితా నచపితృష్వసం!
కేనాపి గ్రామ తడాగే అభ్రముత్తానితం క్షిప్తమ్
తెలుగు
తే.గీ పద్మరాగములన నొప్పు పద్మ చయము
హాయిగా నున్న రాయంచ తతుల
చెలగుచున్నట్టి మనయూరి చెరువు జూడ
ఆకసమునుదించి పరచినట్టులుండె
- ఒక యువతి తన మేనత్తతో ఇలా అంటోంది. ‘‘పద్మరాగాల వంటి పద్మా లు, తెల్లని రాయంచలను మన ఊరి చెరువులో చూస్తుంటే తెల్లని మేఘాలుగల ఎర్రబారిన ఆకాశాన్ని దించి వెల్లకిలా చెరువులో నిలిపినట్లుంది కదా! అత్తా!’’ అని కవితాత్మకంగా వర్ణించింది. ఎల్లని మేఘాలు రాయంచలలాగా, పద్మాలు ఎర్రబారిన ఆకాశంలో ఉన్నాయని గాథాకారుని భావం.
వివరణ:
ఇరవై
నాలుగు గంటల ఛానల్స్ సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రకృతే వారికి వినోదం, విజ్ఞానం హాయగా ప్రకృతిని పరిశీలించి, పరవ శించారు నాటి జనం. ప్రకృతి దేవుడిచ్చిన వరం. దాన్ని కాపాడుకోవడం అత్య వసరం. మంచినీటి చెరువుల్ని కాలుష్యా కాసారాలుగా మార్చకుంటే నేడు మనమూ చెరువుల్లో అందమైన పద్మాల ను చూడవచ్చు. హాయగా తిరిగేచేపలనూ వీక్షించువచ్చు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. అందమైన వూహాలతో జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. కనుక కాలుష్య రహిత ప్రదేశాల కోసం ప్రయత్నిద్దాం పదండి.

ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949