ఆంధ్ర గాథాలహరి

ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ణచ్చణ సలా హణణి హేణ పాసపరిసంఠి ఆణి ఉణగోపీ!
సరిస గోవి ఆణం చుంబఇ కవోలపడి మాగ అంకణ్హమ్
సంస్కృత చ్ఛాయ
నర్తన శ్లాఘన నిభేన పార్శ్వపరి సంస్థితా నిపుణగోపీ
సదృశం గోపీనాం చుంబతి కపోల ప్రతిమాగతం కృష్ణమ్
తెలుగు
తే.గీ
నర్తనము సేయు గోపాంగ నాప్రతిభను
మెచ్చు నెపమున, వేరొక మీననయన
గోపికాక పోలస్థిత గోపబాలు
ముగ్ధమోహన బింబమున్ ముద్దులాడె
ఒక గోపిక అందంగా నృత్యం చేస్తోంది. ఆమె బుగ్గలపై కృష్ణుని ప్రతిబింబం ప్రతిఫలిస్తోంది. అది గమనించిన వేరొక గోపిక ఆమెను మెచ్చుకునే నెపంతో ఆమె బుగ్గపైనున్న కృష్ణుని రూపా న్ని ముద్దులాడింది.
‘కర్షతి చిత్తమితి కృష్ణః’ అని అమరం. కృష్ణవర్ణం మనసును ఆక ర్షిస్తుందని భావం. కృష్ణు డు కూడా ఆబాల గోపా లాన్నీ ఆకర్షి స్తాడు. అదే ఈ గాథలోని వర్ణితం.
జగమంతా కృష్ణ మయం. మరి అటువం టపుడు గోపికా కృష్ణుడే గోపిక చెక్కిలిపై కృష్ణుని బింబం మరో గోపికను ఆకర్షించిందనడంలో విడ్డూరమేముంది? కృష్ణ శబ్దమే ఆకర్షకం. ఇక గోపాలుని మురళీరవం విని పశువులు సైతం తలలూగించేవట. మరి అటువంటపుడు కృష్ణుని రూపుచూచిన వారు మైమరిచి కృష్ణనామం పలుకడంలో మునిగిపోతారు కదా. అందితే ఆ కృష్ణుని స్పృశించకుండా ఎవరుంటారు? దానికి అక్షరరూపమే ఈ పద్యం.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949