ఆంధ్ర గాథాలహరి

వియోగమా? అదెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
రూ అం అచ్ఛీసు ఠిఅం ఫరిసో అంగసు జంపి అంకణ్ణే!
హి అఅం హి అఏ ణిహిఅం విఓఇఅం కిత్థ దేవ్వేణ!! (బ్రహ్మగతి)
సంస్కృత చ్ఛాయ
రూపమక్ష్ణోః స్థితం స్పర్శోంగేషు జల్పితం కర్ణే
హృదయం హృదయే నిహితం వియో జితంకిమాత్ర దైవేన!
తే.గీ కన్నులందునతని రూపు, కదలుండ
వీనులాతని ఊసులే, వినుచునుండ
హదృయమాతని, హృదితోడ ఏవవౌట
ఇక వియోగమ్కెడ? అతనికిని నాకు
పతి చిరకాలం దూరదేశంలో ఉన్న ఒక యువతిని చూచి జాలిపడుతున్న చెలులతో ‘‘అతడు నా కళ్ళల్లో నిలిచే ఉన్నాడు. నా చెవుల్లో అతని మధుర భాషణలు వినపడుతూనే ఉన్నాయి. అతడు నాతో ఎప్పుడూ ఉన్నట్టే ఉంటోంది. అతని హృదయంతో నా హృదయం మమేకమైపోయింది. ఇక మామధ్య వియోగానికి ఆస్కారమెక్కడ?’’ అని ధైర్యంగా వారితో పలికింది.
*
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949