ఆంధ్ర గాథాలహరి

లోభత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం:
హెంతీ విణిప్ఫలచ్చి అధణరిద్ధీహూఇ కివిణపురిసస్స!
గిహ్మా అవసంతతస్సణి అఅ ఛాహివ్య పహి అస్స (కుందపుత్రుడు)
సంస్కృత చ్ఛాయ
భవంత్యపి నిష్ఫలైవ ధనబుద్ధిర్భవతి కృపణపురుషస్య
గ్రీష్మాతప సంతప్తస్య నిజకచ్ఛా యేవ పథికస్య
తెలుగు తే.గీ
కనక గిరులు కలిగియున్నగాని, లోభి

తృప్తిదీరగ తినలేడదెటులయన్న
మండుటెండను పాంధుడు, మాడువేళ
అతని కుపకరింపగబోదు, నతని ఛాయ
అనంతమైన సంపదలు మూలుగుతన్నప్పటికీ కూడా లోభి వాటిని అనుభవించలేడు. అదెట్లా అంటే మండుటెండలో బాటసారికి అతని ఛాయ అతనికి ఉపయోగపడదు కదా! ఉన్న సంపదలను హాయిగా అనుభవించమని ఉద్బోధిస్తున్న గాథ ఇది. పంచభక్ష్య పర మాన్నాలు ఉన్నా తినలేనివానికి శుద్ధ దండుగకదా. అనుభవంలోకి వస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. లోభత్వం మానమనే బోధ.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949