ఆంధ్ర గాథాలహరి

ప్రేమానురాగాలే చాలు -7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృతమూలం
ణో హల అమప్పణో కింణ మగ్గసే కురవ అస్స
ఏ అంతుహసుహగ ఇసఇ వలి అణణ పంక అంజా ఆ (మయరందసేనుడు)

సంస్కృత ఛాయ
దోహదమాత్మనః కిం న మృగయసే కురవకస్య!
ఏవం తవ సుభగ హాసతి వలి తానన పంకజం జాయా
తెలుగు
వెఱ్ఱిమగడు
ఎప్పడూ తోట పనిలోనే నిమగ్నమై, తన్ను పట్టించుకోని పతిని గూర్చి కొత్తగా పెళ్ళైన భార్య ఇలా అనుకుంటోంది

తే.గీ అతివతోడ తరులకు దోహదము చేసి
కాయలుబ్బుగ కాయింప కష్టపడును
గాని, నిజదార కడుపున కాయకొరకు
యత్నమొనరింపడేమి? ఆ హాలికుండు

‘‘ఎంతసేపూ ఆ చెట్టును కౌగిలించుకో, ఈ చెట్టును కౌగిలించుకో! అంటాడే గానీ నా కడుపున ఒక కాయ కాసే మార్గం గురించి ఆలోచించడమేమిటి? ఈ వెఱ్ఱిబాగుల మగడు’’ అనుకుంటూ ప్రక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకొంటోంది.
వివరణ:
అవును మరి భార్యకెంతసేపు భర్తతోడిదే జీవితం. ఆమె ఆలోచన్లు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయ. అంతేకాదు తనే్న చూడాలని, తనకోసం ఏదేదో చేసేయాలని అనుకొంటూ ఉంటుంది. అటువంటి ఆమె మనసును తెలుసుకోకుండా మగడు ఎంతసేపటికీ చెట్టు పుట్టా అనుకొంటే తిరిగితే భార్య మనసు ఏం అంటుందో చక్కగా గాధాకారుడు వివరించాడు.
ఈ కాలంలో కూడా భర్తలందరూనిద్రలేచింది మొదలుకొని కెరియర్ గురించి ఆలోచిస్తూ సంపాదన కోసం పరుగులెడుతూ ఉంటు న్నారు. మరి వారి వారి భార్యల మనోగతం ఎంత దెబ్బతింటుందో వారు పట్టించుకోవడం లేదు. భార్య ఎపుడూ భర్తతో ఉండాలను కొంటుంది కాని పట్టు పరుపులు డబ్బుల కట్టలు ఆశించదు. దీన్ని చూసైనా పురుషులు స్ర్తిల మనోగతాన్ని అర్థం చేసుకొంటారేమో! నేటి విషయం నాడే చెప్పిన గాథాకారుడు ద్రష్టనే.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com