ఆంధ్ర గాథాలహరి

కృతజ్ఞత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఫురియే వామచ్ఛి తుఏ జఇ ఏహిఇ సోపి ఓ జ్జతాసుఇరమ్
సంమీలి అదాహిణ అంతుఇ అవిఏహం పలోఇస్సమ్ (శక్తిహస్తి)
సంస్కృత చ్ఛాయ
స్ఫురితే వామాక్షి! త్వయి యద్యేష్యతి సప్రియోద్యతత్సుచిరమ్
సంమీల్య దక్షిణం త్వయైవైతం ప్రేక్షిప్యే
తెలుగు
తే.గీ
వామ నయనమ్మా! ఇపుడు నీ వదురుకతన
నా ప్రియుడు వేగమే వచ్చి నయముగూర్ప
నీ మహోపకారంబును, నిన్ను దలచి
కాంతువానినెపుడు కుడికన్ను మూసి
నాయికకు ఎడమ కన్ను అదురుతూంది. ఆడవాళ్ళకు ఎడమ కన్ను అదరడం శుభసూచకమంటారు కదా! అందుకు ‘‘ఇప్పుడేకనక నా ప్రియుడు వచ్చినట్లయితే నేను కుడికన్ను మూసి, ఎడమ కన్నుతోనే వాణ్ణి ఎప్పుడూ చేస్తాను’’ అని శపథం చేసింది ఆమె! శుభశకునాల వంటి నమ్మకాలు నాటి సమాజంలో కూడా ఉండేవని ఈ కథ తెలుపుతుంది.

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949