ఆంధ్ర గాథాలహరి

హద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
తారుణ్ణం జారువ్య ఇతా ఛీణం జావ ఛిజ్జిఏ అంగమ్
తాణీససి అంవరాఇఅ జావ అసాసా పహుప్పంతి (వైరశక్తి)
సంస్కృతచ్ఛాయ
తావద్రుతితం యావద్రుత్యతే తావత్‌క్షీణం యావత్‌క్షీయే అంగం
తావన్నిశ్వసితం వరాక్యా యావత్ శ్వాసాః ప్రభవంతి
తెలుగు
తే.గీ ఏడ్చి ఏడ్చి కనుల నీరమింకిపోయె
దేహమంతయు శుష్కించె, తిండిలేక
శ్వాసయొక్కటే మిగిలె, నీ వలపు కొరకు
ఇంక ఏమి చేయగలదు? నింతకన్న
ప్రణయాపరాధానికై ప్రియుడామెతో మాట్లాడడం మానివేశాడు. దిగులుతో ఆమె నిద్రాహారాలు మాని శుష్కించిపోతోంది. అది గమినంచిన ఆమె సఖి అతనితో కేవల శరీర మాత్రయైయున్న ఆమె నీకోసం ఇంతకన్నా ఏం చేయగలదు. ఆమెను క్షమించి ఏలుకో!’’ అని ప్రాధేయపడింది. అలుకకూ , సాధింపుకూ ఓ పరిమితి, ఓ హద్దూ ఉంటాయ. వాటిని అతిక్రమించితే అనర్థాలే కలుగుతాయ. అవి ప్రాణహాని కలిగిస్తే మరీ ప్రమాదం అందుకే హద్దు అదుపు ఉండాల్సిందే. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949