ఆంధ్ర గాథాలహరి

విశ్వజనీనం ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఉద్ధచ్ఛో పిఅఇ జలం జల జహ విరలంగులీ చిరంవహిఓ
పావాలిఆ వి తహతహ ధారం తుణుఇం పితణుఏఇ (భండకుడు)
సంస్కృత చ్ఛాయ
ఊర్థ్వాక్షః పిబతి జలం యథాయథా విరళాంగుళిశ్చరం పథికః
ప్రపాపాలికాపి తథా తథా ధారాం తనుకామపి తనూ కరోతి
తెలుగు
తే.గీ చండ చండముగానెండ మండువేళ
దాహమని పాంథుడొక్కడు తరుణి నడుగ
నీరమాతని దోసిలినింప, వారి
కన్నులుకలిసె, జలధార సన్నబడియె
వ్రేళ్ళు వదులాయె, ప్రవహించె ప్రేమరసము
ఒక నవయువకుడు నడి ఎండలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అతనికి దాహం వేసి ఒక ఇంటి అరుగుపై కూర్చున్న పెళ్లికాని యువతిని మంచినీళ్ళిమ్మని అడిగాడు. ఆమె ఇంట్లోంచి చెంబుతో మంచినీళ్ళు తెచ్చి, అతని దోసిట్లో పోయసాగింది. అతడు త్రాగసాగాడు. అకస్మాత్తుగా ఇద్దరి కళ్ళూ కలిసాయి. కాంసేపు నీరుపోయాలని ఆమె నీటిధారను సన్నబరిచింది. అతడింకొంచెంసేపు త్రాగాలని దోసిలి వేళ్ళ సందుల్ని వదులు చేసి క్రిందకు నీళ్ళను విడువసాగాడు. అలా ఒకర్నొకరు చూసుకుంటూ ఆ యువజంట మైమరిచిపోయింది. - ఇంకావుంది..

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949