ఆంధ్ర గాథాలహరి

నిదుర అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ణిద్దాలస పరిఘ మ్మిరతం సవలం త్థతార ఆలోఆ
కామస్స విదువ్వి సహా దిట్ఠిణి వాఆ ససిముహీఏ
సంస్కృత చ్ఛాయ
నిద్రాలస పరిఘూర్ణనశీల తిర్యగ్వల దర్థతారకాలోకాః
కామస్యాపి దుర్విషహో దృష్టిని పాతాః శశి ముఖ్యాః
తెలుగు
ఆ.వె నిదుర మత్తులోన, నీలి కన్నుల తోడ
మోహవార్థిముంచు, మరువు తోడ
వాలుకనుల రమణి, వలపు చూపుల ధాటి
కా అ నంగుడైన ఆగగలడె
‘‘నిద్దుర మత్తులో అరమోడ్పు కన్నులతో, ఆమె చూచే వలపు చూపులను తట్టుకోవడం కామునికైనా సాధ్యమా!’’ అంటున్నాడు గాథాకారుడు. - ఇంకావుంది...