ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
సహి ఆహిం భణ్ణమాణా థణఏలగ్గం కుసుంభపుప్ఫంత్తి
ముద్దబహు ఆ హసిజ్జఇ పప్ఫోడం తీణహవ ఆఇం!! (బాలాదిత్యుడు)
సంస్కృత ఛాయ
సఖీభి ర్భణ్య మానాస్తనే లగ్నం
కుసుంభ పుష్పమితి
ముగ్ధవధూర్హస్యతే ప్రస్ఫోటయంతీ నఖపదాని!!
తే. గీ ముదిత! నీ యెద కుంకుమ పువ్వుగలదు/ తుడుచుకొనుమంచు సఖియలౌ పడతులనగ/ చెలుని దౌనఖాంకము నామె చెరుపజూడ
పరిహసించిరి వారెల్ల పకపకమని
నాయిక హృదయం మీద నఖక్షతాన్ని గమనించిన చెలులు ఆమెను ఆట పట్టించడానికై ‘‘నీ ఎదమీద కుంకుమ పువ్వు అంటింది తుడుచుకో!’’ అన్నారు. ఆమె కూడా పరధ్యానంగా తుడుచుకునే ప్రయత్నం చేసింది. చెరిపేస్తే చెరిగిపోయే గుర్తా! అది. అందుకే ఆమె సఖులంతా పకమకమని నవ్వారు.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949