ఆంధ్ర గాథాలహరి

గత స్మృతులు (ఆంధ్రగాథాలహరి-45)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
తేవోలిఆ వఅస్సా తాణకుడంగాణ ధానుఆసేసా!
అమ్హో విగ అవ ఆఓ మూలుచ్ఛే అంగ అంపేమ్మం (నిరువయుడు)
సంస్కృతచ్ఛాయ
తే వ్యతిక్రాంతా వయస్కాస్తేషాం కుడంగనాః స్థాణవః శేషా
వయమపి గతవయస్యా మూలోచ్ఛేద్యం గతం ప్రేమ
తెలుగు
తే.గీ
వనె్న చినె్నలు చిందించు వయసుపోయె
ప్రేమ పంచిన పూపొదరిండ్లు పోయె
సతత హితులౌ పరమసఖీ తతియు, బోయె
హృదిని పదిలముగ, మధుర స్మృతులె మిగిలె
ఒక వృద్ధ స్ర్తి తన గత సౌందర్య వైభవాన్నీ, పూల పొదరిండ్లు, ఇష్టసఖులు, పరువము గతించిన వైనాన్నీ నవ యువతులకు వివరిస్తూ- కేవలం మధుర స్మృతులే మిగిలాయని విచారిస్తోంది.
వివరణ: ‘మేం ఆ రోజుల్లో!’ అంటూ పెద్దలు వినిపించే పడక్కుర్చీ కబుర్లులాంటి గాథ ఇది. ‘ఆనాటి తీపిగుర్తులేవీ’ అని మెమరీస్‌ను నెమరేసుకోవడం ప్రతి మనిషీ చేసే పనే. పండ్లూడిపోయిన తాతయ్య ‘ఆ రోజుల్లో చెరకు గడలనూ, రేగుపండ్లనూ నోటితోనే నమిలేవాడినని’ చెప్తూండడం మనం చూస్తూనే ఉంటాం. అదే కోవలో పోయిన వాటిని తలచుకొని, మధురస్మృతులను నెమరేసుకుంటున్న మామ్మగారి గాథ ఇది. వారి జీవితానుభవాలలో పిన్నలకు ఉపకరించే వాటిని చెప్పడం సముచితమేమో!
ఎప్పుడైనా అనుభవానికే పెద్దపీట. ఎంత చదువు చదివినా అనుభవమున్నవారి సలహాను పాటించినట్టే పెద్దల అనుభవ పాఠాలు వారికి తీపిగుర్తులైతే, పిల్లలకు గుణపాఠాలుగా చక్కని రహదారికి మార్గాలుగా పనికి రావడం ప్రతివారి జీవితంలోను ఎప్పుడో ఒకప్పుడు తారసపడినవే.

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949