ఆంధ్ర గాథాలహరి

అసమాన సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
జస్స జహం విఅ పఢమం తిస్సా అంగమ్మి ణివడి ఆ దిట్ఠీ
తస్సతహిం చే అఠీఅ సవ్వంగం కేణ విణదిట్ఠమ్ (అర్థరాయడు)
సంస్కృత చ్ఛాయ
యస్య యత్రైవ అపథమం తస్యా అంగే నిపతితాదృష్టిః
తస్య తత్రైవ స్థితా సర్వాంగం కేనాపి నదృష్టమ్
తెలుగు
ఆ.వె
ఆమె మేనినెచట, అవలోకనము సేయ
కన్నులచటె, నిలచు కారణమున
పొలతి సొగసును, పరిపూర్ణముగగనిన
పురుషుడెవడు గలడు? భూమిపైన
ఈ గాథలో నాయకుడు నాయిక సౌందర్యాన్ని అతిశయోక్తిగా వర్ణిస్తున్నాడు. ‘‘ఆమె అతిలోక సౌందర్యరాశి. ఆమె సర్వాంగాలూ సౌందర్య సంశోభితాలే.. ఆమెను మొదట ఎవడు ఎచట చూస్తాడో, అచ్చటినుండి చూపు మరల్చుకోలేడు. అందువల్ల ఆమె ఇతర అవయవ సౌందర్యాన్ని అతడు చూడలేదు. అందువల్ల ఆమె సౌందర్యాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా చూచిన మానవ మాత్రుడెవడున్నాడు, కనుక!’’
వివరణ: నాయిక అతిలోక సౌందర్యరాశి అని చెప్పడానికి ఎంత గొప్ప ధ్వనిని నిక్షిప్తం చేశాడు గాథాకారుడు. ఆమె యొక్క ఏ అవయవాన్ని చూస్తే అక్కడే చూపు నిలచిపోతుందని చెప్పడం గొప్ప టెక్నిక్. అందుకే ప్రాకృత సాహిత్యం రసభరితము, ధ్వనిమహితము ఐనదని కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులవారంటారు. వారి మాట అక్షరసత్యం.
కనుకనే గొప్ప గొప్ప సౌందర్యారాధకులు సౌందర్యమనేది ఒక గని అంటారు. తవ్విన కొలది మణిమాణిక్యాలు పుట్టుకొచ్చినట్టే సౌందర్యమూ ఒక్కో అవయవానికి రెట్టింపు సౌందర్యముంటుందే కానీ దీనికి లేదు అని చెప్పడానికి వీలుండదు.
ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949