ఆంధ్ర గాథాలహరి

లేఖ వ్రాసేదెట్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె.గీ ప్రేమలేఖ వ్రాయగ నెంచ ప్రియతమునకు
వాని తలపులతో చేయి, వణకసాగె
‘స్వస్తి’యనుమాట, సైతము వ్రాయలేక
పోయితి, నిక లేఖను పూర్తిసేయుటెట్లు
‘‘ప్రియుడికి ప్రేమలేఖ వ్రాద్దామని కూర్చున్నాను. వాని తలపులతో చేయి వణకసాగింది. చెమటలు పట్టసాగాయి. లేఖిని పట్టు కోల్పోతోంది. తొలుత క్షేమం అనే సమాచారం తెలిపే ‘స్వస్తి’ అనే మాటను కూడా పూర్తిచేయలేకపోయినాను. ఇంక లేఖను పూర్తిచేయగలనా సఖీ!’’ అంటూ అనుంగు చెలికత్తెతో తన విరహ బాధను తెలియజేసింది నాయిక.
వివరణ:‘ప్రేమలేఖ’ వ్రాయడం ఒక కళ. దాన్ని అందుకున్నవాళ్ళు అనేకసార్లు చదివి ఆనందించడం గొప్ప అనుభూతి. అసలిప్పుడు లేఖలెక్కడివి. మాటలు దాటి ‘ఎమోజీ’ల యుగంలోకి ప్రవేశించాం. అన్ని భావాల వ్యక్తీకరణకూ
యువత - ఎమోజీలమీదే ఆధారపడుతోంది. రాన్రాను మాటల ప్రమేయం తగ్గి మళ్లీ సైగలు వస్తాయేమో!
ప్రాకృతమూలం
వేవిరసిణ్ణ కరంగు లిపరిగ్గ హక్షసి అలే హణీ మగ్గే
సోత్థివ్వి అణ సమప్ప ఇ పిఅసహి లేహమ్మికిం లిహియో (అంధుడు)
సంస్కృత ఛాయ
వేపనశీలా స్విన్నకరాంగులి పరిగ్రహస్ఖలిత లేఖనీ మార్గే
స్వస్త్వేవన సమాప్యతే ప్రియసఖి లేఖే కిం లిఖామః

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949