ఆంధ్ర గాథాలహరి

భావములోన... 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ: స్వచ్ఛ మరకత స్థిమైన శంఖమట్లు
మధుర జలధర కాసార మధ్యమందు
నిశ్చల తపస్సమాధి వినిష్ఠితగతి
జలజపత్రంబుపై కొంగ, నిలచె చూడు
వివిరణ: ఒక అందమైన, నిర్మానుష్యమైన కొలనులో తామరాకు మీద కదలకుండా నిలచి ఉన్న కొంగను చూపిస్తూ నాయిక ‘‘చూడు! ఆ కొంగ పచ్చల పాత్ర (పళ్ళెం)పై నిలచి ఉన్న తెల్లని శంఖంలా లేదూ!’’ అని కవితాత్మకంగా చెప్పింది.
మరొక అర్థం చూస్తే
చూసే కనులనుబట్టి పదార్థం కనిపిస్తుంది. చీకటిలో తాడును చూసి పాము అని భయపడితే అది పాముగానే కనిపిస్తుంది. అత్యంత విషాదభరితమైన భయాన్ని కలిగిస్తుంది. అదే వెలుతురులో ఆ తాడునే చూసి ఇది తాడే గదా అనుకొంటాం. అపుడు మచ్చుకు కూడా భయమనేది ఉండదు.
దీనే్న పరమాత్మ పరంగా చూసుకొన్నపుడు సాధారణ వ్యక్తులకు భగవంతుడు కనిపించకపోయినా అంతటా నిండి ఉన్న పరమాత్మ గురించి చెప్పే కథలనువిని ప్రతి అణువులోనూ పరమాత్మను చూసే నేర్పును కలిగించుకుంటే మనిషి ఋషిగా మారుతాడు. భౌతికంగాను, లౌకికంగాను కూడా అంతా సమానత్వ భావం ఏర్పడి ఎవరూ అధికులుగానో అల్పులుగానో కనిపించరు.
రమణ మహర్షులు కూడా అంతటా నిండి ఉండేది పరమాత్మ మధ్యలో నేను ఎవరు అంటారు. ఆయనెపుడూ ఈ శరీరం అనేవాళ్లు కాని నా శరీరం అనేవారు కాదట. శరీరం వేరు ఆత్మ వేరు. ఉన్నది ఒకటే ఆత్మ. పలురకాలు వేషాలు వేసినట్టుగా పలుశరీరాలల్లో ఉంటుంది. కనుక మనకు కనిపించేదాన్ని బట్టి ఫలాన అని చెబుతున్నాం కాని నిజానికి మనం చెప్పేదేదీ అక్కడ లేదు. ఉన్నది ఒక్క ఆత్మనే అంటారు. అట్లాగే కొంగలోను శంఖాన్ని చూడగలిగిన నైపుణ్యం అలవర్చుకోమని ఈ పద్యంలోని అంతరార్థం.
ఇదే తత్వాన్ని అంటే మన దృష్టిని బట్టే పదార్థం ఉంటుందనే భావన బలం చేకూరేటట్టు ఈ గాథాకారుడు ఈ చేపల కోసం తామరాకులపై నిశ్చలంగా నిల్చున్న కొంగ పచ్చని పళ్లెంలో నిల్చోబెట్టిన శంఖంగా కనిపిస్తుందని అన్నాడు.

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com