ఆంధ్ర గాథాలహరి

పెట్టిననాడు పెళ్లికూడు..-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె పెట్టుచున్నవరకు, పెన్నిధిగా బిల్చి
ఇంద్రుడనుట, శీత చంద్రుడనుట
పెట్టలేనివేళ, పెనుతిట్లు తిట్టు
ఈ జగాన ఖలుల, నైజమగును
-పెట్టినవాడు పెళ్లికూడు, పెట్టనివాడు పిండాకూడు’ అన్నది తెలుగు జాతీయం. అదే ఈ గాథలో ప్రతిపాదంచబడింది. నీచులైన వాళ్ళు పెట్టినన్నాళ్ళే మంచిగా పొగుడుతారు, పెట్టనినాడు తీవ్రంగా తిడతారు. ఇదే లోకం నైజం అంటున్నాడు జయరాయుడు
వివరణ: ‘ఎప్పుడు సంపదగల్గిన / అప్పుడు బంధువులు వత్తురది ఎట్లున్
తెప్పలుగ చెరువు నిండిన / కప్పలు పదివేలు జేరు గదరా! సుమతీ! అని బద్దెన అంటాడు. సంపద ఉన్నంతవరకు బంధాలు, బాంధవ్యాలు బలంగా ఉంటాయి. పరపతి, సంపద లేనపుడు అతడు మా బంధువని ఎవరు చెప్పుకుంటారు? అలా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుని కున్నంత గొప్ప మనసుండాలి. ‘కుచేలుడు’ అంటేనే చెడ్డబట్టలు ధరించినవాడని అర్థం. అలాంటివాణ్ణి తన స్నేహితునిగా పరిచయం చేసి అతిథి మర్యాద చేసిన శ్రీకృష్ణుడే మనకు ఆదర్శం. రాజైనవేళ ద్రోణుని ‘నీతో నాకు స్నేహమేమంటి?’ అని ప్రశ్నించిన ద్రుపదుడూ మన పురాణాల్లో ఉన్నాడన్న సంగతినీ మరువకూడదు. ధనం ఉన్నా లేకున్నా మనసున్నవారితో స్నేహితమే మానవీయం.
ప్రాకృతమూలం
అఉలీణో దోముహఓ తా మహురో భోఅణం ముహేజావ
ముర ఓ వ్యఖలో జిణ్ణమ్మి భో అణే విరసమారసఇ
సంస్కృత ఛాయ
అకులీనో ద్విముఖస్తావ న్మధురో భోజనం ముఖేయావత్
మురజ ఇవఖలో జేరే భోజనే విరసమారసతి
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949