ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి-- 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను తడిసినా ఫరవాలేదు

ఆ.వె తరుణి తడియుగాని, ధవుని రాక తెలుపు
గోడమీదనున్న గుర్తుపైన
చేతులడ్డుపెట్టి చెరిగిపోనీయదు
జోరువాన గాలిహోరులోన
గొప్ప గాలివాన కురుస్తోంది. పతి దూర దేశానికి వెళ్ళాడు. వెళ్తూ, వెళ్తూ తాను ఎప్పుడు వచ్చదీ గోడపై గుర్తుగా వ్రాసివెళ్ళాడు. ఇంటికప్పుకు ఏర్పడిన కన్నంలోంచి వర్షం గోడవారగా జారుతోవంది. పతిరాకను తెలిపే ఆ గుర్తెక్కడ చెరిగిపోతుందోనని ఆమె నిలువెల్లా తడుస్తున్నా చేతులడ్డుపెట్టి ఆ గుర్తును మాత్రం రక్షించుకుందట. ఎంత గాఢమైన అనురాగం. మనసు ద్రవించడంలేదూ!
వివరణ
ఎప్పుడో రెండు వేల ఏళ్ళనాడు గడియారాలు, కాలెండర్లు అందుబాటులో లేనపుడు కొండగుర్తులే గతి. అందునా చదువురాని పల్లె జనులకు పంచాంగం కూడా తెలియదు. అందువల్ల గోడమీద గుర్తులు, గులకరాళ్ళు లెక్కపెట్టుకోవడం వంటివే నాడు కాలాన్ని గుర్తించే సాధనాలు. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో పెద్దవాళ్ళు నీడనుబట్టి టైం ఎంతైందో చెపుతారు. ఈ గాధ ఆ అమాయక పల్లెపడుచు దీనస్థితినీ, నాటికాల గణననూ తెలియజేస్తుంది.
ప్రాకృతమూలం
జంఝావా ఉత్తిణి అఘర వివరపలోట్టసలిల ధారాహిం!
కుడ్డలి హిఓహి అహం రక్ఖఇ అజ్జాకరీ అలేహిం (జయసేనుడు)
సంస్కృత ఛాయ
ఝంజావాతోత్తృణీకృత గృహవివరణ ప్రపతత్సలిల ధారాభిః
కుడ్యలిఖితావధి దివసం రక్ష త్యార్యాకరతలైః

--ఇంకావుంది...