ఆంధ్ర గాథాలహరి

సన్నబడుతున్న వనె్నలాడి ( ఆంధ్రగాథాలహరి-58)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె నీదు మనములోన నెలతలు మెండుగా
నిలచి యుండిరనుటతెలిసి తెలిసి
హృదయ సీమలోన నిసుమంత చోటుకై
సన్నబడుచునుండె వనె్నలాడి

నీ హృదయంలో అనేకమంది స్ర్తిలు క్రిక్కిరిసి ఉన్నారని తెలిసి కూడా ఆమె నీ హృదయంలో స్థానం కోసం మరింతగా సన్నబడుతోందని ఒక వనె్నకాడితో దూతిక పలుకుతోంది

వివరణ: బరువు తగ్గడాలు, డైటింగులు వంటివి నాడే ఉన్నాయేమోననిపిస్తోంది ఈ గాథ చదువుతూంటే. నాయిక, నాయకుడి మనస్సులో చోటు సంపాదించడానికి ప్రయత్న పూర్వకంగా సన్నబడుతోందని చెప్పడం ఎంత చమత్కారం.

ప్రాకృతమూలం
మహిలా సహస్సభరిఏ తుహ హి అఏ సుఅహసాఅమాఅం!
ది అహం అణణ్ణకమ్మా అంగం తణు అంపి తను ఏఇ (హాలుడు)

సంస్కృత ఛాయ
మహిలా సహస్ర భృతే తవ హృదయే సుభగ సా అమాంతీ
దివ సమనన్య కర్మా అంగం అనుకమపి తనూ కరోతి - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949