ఆంధ్ర గాథాలహరి

అంతరంగంలో అదే చల్లదనం (ఆంధ్రగాథాలహరి-59)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె శీతవేళలోన చెరువులో నీరంబు
లోన చల్లదనము, పైన వేడి
అటులె కృద్ధుడైన అమలిన హృదయుండు
కోపి బయట, శాంతగుణియె హృదిని

శరత్కాలంలో చెరువులో నీళ్ళు పైన వేడిగా ఉంటాయి. కానీ లోపల మాత్రం చల్లగానే ఉంటాయి. అట్లాగే సజ్జనులైనవారు ఎప్పుడైనా పైకి కోపంగా కనిపించినా లోపల మాత్రం శాంతంగానే ఉంటారని ఈగాథ సారాంశం.

వివరణ

ఉత్తములకు ప్రథమ కోపమే గానీ దీర్ఘకోపముండదు అనే విషయాన్ని ప్రతిపాదిస్తుందీ గాథ. ఏదైనా సందర్భంలో ఎవరిమీదైనా కోప్పడవలసి వస్తే, దాన్ని అంతటితో వదిలేయాలి గానీ, దానే్నదీర్ఘకాలంపాటు మనసులో ఉంచుకోకూడదు. అలా మనసులో కోపం గూడుకట్టుకుంటే అది పగగా మారి ఎన్ని ప్రమాదాలకైనా దారితీయవచ్చు. అందుకే ‘కోపాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్లే’నంటారు. ఈ గాథ కూడా ఉత్తములైనవాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారని చెపుతుంది.

ప్రాకృతమూలం

సరఏ మహద్ధదాణం అంతేసిసిరాఇం వాహిరుహ్ణాఇం
జా ఆ ఇంకువిఅ సజ్జణ హిఅ అసరిచ్ఛా ఇ సలిలాఇం (విగ్రహరాజు)

సంస్కృత ఛాయ

శరది మహాహ్రదా నామంతః శశిరాణి బహిరుష్ణాని
జాతాని కుపిత సజ్జన హృదయ సదృక్షాణి సలిలాని - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949