ఆంధ్ర గాథాలహరి

నమ్మకమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఉహ్ణో ఇం ణీససంతో కింతిమహ పరమ్మహీ ఏం స అణద్ధే!
మి అఅం పలీవి అవి అణుస ఏణ పుఠ్ఠింపలివేసి!! (అనంగుడు)

సంస్కృతఛాయ
ఉష్ణాని నిఃశ్వసిన్ కిమితి మమ పరాన్ముఖ్యాం శయనార్థే
హృదయం ప్రదీప్యా ప్యానశయేన ప్రష్ఠప్రదీపయసి

తెలుగు
తే.గీ కల్లలాఢినావు, హృదిని కాల్చినావు
వలదు వలదని నేనటువైపు తిరుగ
వదలకను కాల్చుచుంటివి, వనె్నకాడ!
విరహ నిశ్వాసములతోడ వీపువైపు
వివరణ ప్రియుడు ఆమె హృదయాన్ని గాయపరిచాడు. ఆమె పడకపై అటువైపు తిరిగి పడుకుంది. అతని వేడి నిట్టూర్పులుల ఆమె వీపును తాకుతున్నాయి. అప్పుడామె ‘‘మోసం చేసి హృదయాన్ని కాల్చడమే కాకుండా వేడి నిట్టూర్పులతో వీపును సైతం కాలుస్తున్నావా!’’ అంది.
భార్యాభర్త ల మధ్య నమ్మకం ప్రధానం. మాట మీద నిలబడడం ప్రధానం. ఈరెండు విషయాల్లో ఎక్కడ తేడా వచ్చినా పడక గదిలో ఎడమొగమూ పెడమొగమే. అలా మాట మీద నిలబడని వాళ్లతో ఎప్పుడూ జగడమే. అలాంటి జంట ఉదంతమే ఈగాధ.
నిజమే కదా. ఇపుడున్న పరిస్థితులు కూడా అలాంటివే. భార్యాభర్తలిరువురుఉద్యోగస్థులే. వారిరువురు మధ్య మధ్య సయోధ్య లేకపోతే ఆ ఇల్లు నరకం అవుతుంది. ఆఫీసులో ఎన్నో విషయాలుం టుంటాయ. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఆ ఇద్దరిలో ఎవరు మరొకరితో స్నేహం గా ఉంటే చాలు పక్కవారికి అపనమ్మకం కలుగుతుంది. ఇక వారి చేసేవన్నీ తప్పులుగా ఏదో మోసం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంటాయ.
అనుమానం పెనుభూతం అన్నారు. అక్కడ ఉప్పు ఉన్నా అది కర్పూరమేమో అంటారు. అందుకే దాంపత్యం అంటేనే ఒకరి మీద మరొకరికి నమ్మకం. ఆ నమ్మకమే వారిమధ్య బంధం బలపడడానికి పునాది అవుతుంది. ఆ బంధమే నూరేళ్లపంటగా పండుతుంది. అందుకే మొట్టమొదటి నుంచి ఎవరికి వారు సత్యధర్మాలకు కట్టుబడి ఉండాలి. మోసాలకు , అబద్ధాలకు తావివ్వకూడదు. అపుడే ఆ బంధం నాలుగునాళ్లు నిలిచి ఉంటుంది. ఆ బంధం నలుగురికి ఆదర్శవంతం అవుతుంది. నమ్మకమేపునాదికి తార్కాణం దాంపత్య బంధమే.