ఆంధ్ర గాథాలహరి

వినబడాలా.. ( ఆంధ్రగాథాలహరి-60)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ హృదిని మధుభావలహరుల రేపు, నీదు
ప్రియవచనముల మరి మరి వినగగోరి
వినబడుట లేదని నటించి, వెలది నాకు
చేతిసైగ చేసి మరల చెప్పమనును
నాయకుడు తన ప్రేమను వెల్లడిసూత దూతిక చేత వర్తమానం పంపించాడు. ఆ వర్తమానాన్ని మళ్లీ, మళ్లీ వినాలనే తలంపుతో తనకు వినపడనట్లుగా నటిస్తూ చేతి సైగ చేసి మళ్లీ చెప్పమంటోందా దూతికను.
వివరణ: ఈ నైజాన్ని మనం పొగడ్తల విషయంలో కూడా లోకంలో చూస్తూంటాం. ‘ఇందాక సరిగ్గా వినలేదు, మళ్లా చెప్పు!’ అని పొగడ్తలను మరలా మరలా చెప్పించుకోవడం మనకు అనుభవైక వేద్యమే తన్ను పొగిడినమాటల్ని మరొకరికి పదే పదే వినిపించమని వేధించే వాళ్ళూ ఉంటారు. మంచి వార్తలనుకూడా మళ్లా మళ్లా వినాలనుకోవడం మానవ నైజం. అదే విషయాన్ని ఈ గాథ తెలియజేస్తుంది.
ప్రాకృత మూలం..
బహఉసోవి కహిజ్జంతం తుహ మఅణం మజ్ఘ హత్థసందిట్ఠమ్
ణ సుఅం త్తి జంపమాణా పుణరుత్త సఅం కుణఇ అజ్జా (సురభి వంశ్యుడు)
సంస్కృత ఛాయ..
బహుశోపి కథ్యమానం తవవచనం మమహస్త సందిష్టమ్
న శ్రుతమితి జల్పంతీ పునరుక్త శతం కరోత్యార్యా - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949