ఆంధ్ర గాథాలహరి

స్పందించే స్నేహం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. స్పందనము లేని గోడపై ప్రతిమలట్లు
చేతనైనట్టి సాయమ్ము సేయకుండ
కష్టమున మోము తప్పించు ఖలులగాక
కోమల హృదుల స్నేహమ్ము కోరవలయు
గోడపై ఉన్న బొమ్మల్లాగా ఆపద సమయంలో స్నేహితుల కష్టాలను ఉపేక్షించి చూస్తూ, ముఖం తప్పించే వాళ్ళను గాక మంచివాళ్ళ స్నేహానే్న ఎల్లప్పుడూ కోరుకోవాలని నాయిక ప్రియుడికి ఉద్బోధిస్తోంది.
వివరణ:
‘అక్కరకురాని చుట్టము’ పద్యానికి ముందు రూపంలా కనిపిస్తందీ గాథ. ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్‌డీడ్’ అన్న ఆంగ్ల వాక్య సారాంశాన్ని ఏనాడో చెప్పిన గాథ ఇది. కష్టాల్లో ముఖం తప్పించే స్నేహితుల్ని కాకుండా, నీకోసం నలుగురు మంచి స్నేహితుల్ని ఎంచుకోమంటుందీ గాథ.
ప్రాకృతమూలం
తం మిత్తం కా అవ్వం జం కిర వసణమ్మి దేస ఆలమ్మి
అలిహి అభిత్తి వా ఉల్ల అం వణ పరమ్ము హంఠాఇ (పాలితుడు)
సంస్కృత ఛాయ
తన్మిత్రం కర్తవ్యం యత్కిల వ్యసనే దేశకాలేషు
ఆ లిఖిత భిత్తి పుత్తలకమివ న పరాన్ముఖం తిష్ఠతి

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949