ఆంధ్ర గాథాలహరి

బేలచూపుల జాలి గాథ (ఆంధ్రగాథాలహరి-62)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృత మూలం
ఎక్కేక్క భవ ఇవేఠణ వివరంతర దిణ్ణ తరలణ అణాఏ
తఇబోలంతే బాలఅ! పంజరస ఉణా ఇఅం తీఏ (అరికేసరి)
సంస్కృత చ్ఛాయ
ఏకైక వృత్తి వేష్టన వివరాంతర దత్త తరళ నయ నయా!
త్వయివ్యతిక్రాం తే బాలక! పంజర శకునాయితం తయా
తెలుగు
ఆ.వె నీ ప్రయాణవేళ, నెమ్మనమ్మునకుంది
పంజరమున నున్న పక్షివోలె
తడిక కంతనుండి తడికళ్ళతో జూచు
కాంత బేల చూపు, కనుము కనుము
‘‘నీవు ప్రయాణమై పరదేశానికి వెళుతూ ఉంటే, నీ భార్య ఎంత బేలగా తడిసిన కళ్ళతో, తడిక కంతలలోంచి చూచి బాధపడుతుందో చూ డు!’’ అని దూతిక నాయకుడితో ఆర్ద్రంగా చెపుతోంది.

వివరణ
ఇది ఒక జాలి గాథ. భర్త విదేశానికి వెళుతుంటే బేలగా చూస్తూ ఉండిపో నిస్సహాయురాలి దైన్యాన్ని వర్ణించాడీ గాథలో. నాడు ఇళ్ళల్లో గోడలకు బదులు వెదురు తడికలు వాడేవారు. ఆ తడికలకు చిన్న చిన్న రంధ్రాలుండేవి. ఆ తడిక కంతలలోంచి తడిసిన కన్నులతో వీడ్కోలు పలికిన వనిత గాథ ఇది.
ఇది అనుభూతికి, మమకారానికి నిలువెత్తు సాక్షం ఉన్న కథ. అత్మీయులెవరైనా తమను విడిచివెళ్తుంటే హృదయం ద్రవించి కన్నీటి రూపంలో కనుల నుండి బయటపడుతుంది. ఇది ప్రతిఒక్కరికి అనుభవైకవేద్యమే అయ ఉంటుంది.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949