ఆంధ్ర గాథాలహరి

జాణతనం ( ఆంధ్రగాథాలహరి-63)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఆద్ధచ్ఛి పేచ్ఛిఅం మాకరేహి సాహావి అంపలోఏహి
సోవి సుదిట్ఠో హోహి ఇ తుమంపి ముద్ధా కలిజ్జిహిసి
సంస్కృత చ్ఛాయ
అర్థాక్షిపేక్షితుం మాకురు స్వాభావికం ప్రలోకయ
సోపి సుదృష్టో భవిష్యతి త్వమపి ముగ్ధాకలిష్యసే
తెలుగు
ఆ.వె అట్లు చూతువేమి? అరమోడ్పు కనులతో
నీవు జాణవంచు నెంచునేమొ!
ప్రక్క చూపుగాక, స్వచ్ఛంబుగా జూడ
ముగ్ధ వీవనంచు మరియువాడు
‘‘ఓ చెలీ! ఏమిటలా సగం మూసిన కన్నులతో చూస్తున్నావు! నిన్ను అతడు అన్నీ తెలిసిన జాణగా భావిస్తాడేమో! సహజంగా, స్వచ్ఛంగా సూటిగా నీవు చూసినట్లయితే అతడు నిన్ను అమాయకురాలిగా భావిస్తాడు. అమితంగా ప్రేమిస్తాడు’’ అని నాయికకు హితోపదేశం చేస్తోంది దూతిక.
వివరణ
వంకర చూపులు, వంకర మాటలు ఎప్పుడూ ప్రమాదకరమే! స్వచ్ఛమైన మనస్సు, నిజాయితీగల మాటలు, నిర్మలమైన చూపు, ఎవరిని ఆకర్షించవు? తెచ్చిపెట్టుకున్న జాణతనాన్ని కట్టిపెట్టి నీవు నీవుగా ఉంటే బాగుంటుందని చెప్తోంది దూతిక.
నిజమే కదా. నేటికాలంలో కూడా భార్యా భర్తల విషయం లోనో, లేక ప్రేమికుల విషయంలోనో ముక్కుకు సూటిగా మాట్లాడితేనే అవతలి వారి మనస్సు అద్దంలాగా కనపిస్తుంది. లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడితే ఏదో దాచి మాట్లాడుతున్నారనుకొనే ప్రమాదం ఉంటుంది. ఏమీ లేకపోయనా అనుమాన మేర్పడితే చాలు పెనుభూతమై చుట్టుకుంటుంది. కనుక అనుమానం కలిగించ కుండా స్వచ్ఛంగా ఉంటేనే మేలు. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949